రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో రూ.50 నోట్లను విడుదల చేయనుంది. ఈ నోట్లు కొత్త RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం, చెలామణిలో ఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ పేరుతో ముద్రించబడ్డాయి. సంజయ్ మల్హోత్రా గత సంవత్సరం డిసెంబర్‌లో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంలో, మహాత్మా గాంధీ సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను విడుదల చేయాలని నిర్ణయించినట్లు RBI బుధవారం తెలిపింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న పాత నోట్లు చెల్లుబాటులో ఉంటాయని RBI తెలిపింది.