Itel Mobile: సరికొత్త ఐటెల్ ఫోన్.. ధర తెలిస్తే షాక్ అవుతారు..

ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ Itel బడ్జెట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఐటెల్ జెనో 10 (Itel Zeno 10)  పేరిట కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. మరి ఫోన్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఐటెల్ కంపెనీ ఐటెల్ జెనో 10 స్మార్ట్ మొబైల్ ను రూ. 5,699 కి లాంచ్ చేసింది. ఇది జెన్ జెడ్ వినియోగదారులను ఆకర్షించడానికి రూపొందించారు. ఈ ఫోన్ అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది 3 GB RAM తో 64 GB స్టోరేజ్ కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ 4 GB వేరియంట్‌లో కూడా లాంచ్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ ఫాంటమ్ క్రిస్టల్, ఒపల్ పర్పుల్ అనే రెండు రంగుల్లో విడుదల అయింది. ఫోన్‌లో భద్రత కోసం.. ఫేస్ అన్‌లాక్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ జోడించారు.

ఈ మొబైల్ 6.56 HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది లీనమయ్యే వీక్షణ అనుభవం కోసం డైనమిక్ బార్‌లను అందిస్తుంది. ఇక కెమెరా గురుంచి మాట్లాడితే.. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో 8MP AI కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం.. 5MP సెన్సార్ ఉంది. ఇది పోర్ట్రెయిట్ మోడ్, HDR మోడ్, వైడ్ మోడ్, ప్రో మోడ్, షార్ట్ వీడియో, స్లో మోషన్, AR షార్ట్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఫోన్‌కు పవర్ సపోర్ట్ అందించడానికి 5000 mAh బ్యాటరీ కలిగి ఉంది.