ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో పోటీ పడి తన గ్లామర్ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సుమన్. సుమన్ డేట్స్ కోసం దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టేవారు.
చిరంజీవి లాంటి హీరోలతో సుమన్‌కి పోటీ ఉండేది. కరాటేలో బ్లాక్ బెల్ట్ తో ఆకట్టుకునే అందంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుమన్. 1959 ఆగస్టు 28న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన సుమన్ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. తెలుగులో కరాటే బెల్ట్ సాధించిన తొలి హీరో. స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో సుమన్ ఇంటిపై అర్థరాత్రి పోలీసులు దాడులు చేశారు. బ్లూ ఫిల్మ్స్ ఇష్యూలో హీరో సుమన్ అరెస్టయ్యాడు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో.. ఇదంతా ఎవరు చేస్తున్నారో సుమన్‌కు అర్థం కాలేదు. ఆ కేసు నుంచి బయటపడేందుకు సుమన్ చాలా రోజులు పట్టింది. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ప్రముఖ హీరోపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఆ కేసు కారణంగా సుమన్ జైలు జీవితం గడిపాడు. అయితే దీనిపై సుమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అమ్మాయిలపై నీలి చిత్రాలు తీసి వేధించాడంటూ కేసులు పెట్టారన్నారు. గుండాల నిరోధక చట్టం, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో బెయిల్ కూడా రాలేదన్నారు. ఆధారాలు అడిగితే విచారణ జరుపుతామని చెబుతారని అన్నారు. తనను ఎందుకు అరెస్టు చేశారనేదానికి తన వద్ద సమాధానం లేదన్నారు. పోలీసుల వద్ద కూడా సమాధానం లేదని అన్నారు. సైదాబాద్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఆ తర్వాత మద్రాసు జైలుకు తరలించి, సాధారణ ఖైదీలను ఉంచే సెల్స్‌లో కాకుండా అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను ఉంచిన సెల్‌లో ఉంచారు. మే 1985లో సుమన్ జీవితంలో మరిచిపోలేని సంఘటనలు జరిగాయి. ఏం జరుగుతుందో, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో అర్థంకాని స్థితిలో ఉండిపోయాడు. జైలుకెళ్లి తానే ధైర్యం చేశానన్నారు. ఒకసారి కరుణానిధి వచ్చి ఆయన పరిస్థితి చూసి చలించిపోయారని అన్నారు.
Related News
జైలు అధికారులను హెచ్చరించి మరో సెల్‌కు తరలించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే తనపై రాజకీయ కుట్ర వల్లే జైలు జీవితం గడపాల్సి వచ్చిందన్నారు. సుమన్ తల్లి న్యాయ పోరాటం చేసింది. అయితే హీరోయిన్లు సుమలత, సుహాసిని తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. అంతకు మించి ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కొడుకు విడుదల కోసం సుమన్ తల్లి చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పెరిగింది. దేశంలోనే ప్రముఖ న్యాయవాదులు రామ్‌జెఠ్మలానీ, సోలీ సొరాబ్జీల మార్గదర్శకత్వంతో తమిళనాడుకు చెందిన రామస్వామి అనే న్యాయవాది కోర్టులో గట్టిగా వాదించి సుమన్‌కు బెయిల్ మంజూరు చేశారని అన్నారు. దాదాపు ఐదు నెలల తర్వాత జైలు నుంచి స్వాతంత్య్ర గాలి పీల్చుకున్నానని చెప్పారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో హీరోగా సుమన్ కెరీర్ సగంలోనే ఆగిపోయింది. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాల్సి వచ్చింది. హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా.. మునుపటి క్రేజ్‌ని తిరిగి పొందలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు.