పదవ తరగతి పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరిగే పరీక్షలకు అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,09,403 మంది విద్యార్థులు వాటికి హాజరు కానున్నారు.
ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పర్యవేక్షణ కోసం 2650 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో సెక్షన్ 144 అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘా ఉంటుందని, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
Related News
5 నిమిషాల గ్రేస్ పీరియడ్
ఈసారి పరీక్ష రాసే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ప్రకటించారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా, విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కానీ అధికారులు ముందుజాగ్రత్తగా కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. ఆలస్యంగా వచ్చి టెన్షన్ తో పరీక్ష రాయకుండా, ముందుగానే చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని చెబుతున్నారు.