TELANGANA INTeR RESULTS: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేది అప్పుడే ..!!

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు కూడా అతి త్వరలో విడుదల కానున్నాయి. ఈ మేరకు సమయం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఈరోజే విడుదల అయిన విషయం తెలిసిందే. ఏపీలో ఇంటర్ ఫలితాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర అధికారులు కూడా సన్నాహాలు ప్రారంభించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాల విడుదలకు కూడా సమయం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25 లేదా 27న ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5 నుండి 25 వరకు జరిగిన పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరయ్యారు. అధికారులు ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేసి ఆన్‌లైన్‌లో మార్కులను కూడా ఫీడ్ చేశారు. ఏప్రిల్ 20 నాటికి రీ-వెరిఫికేషన్ కూడా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అంటే ఏప్రిల్ 25 తర్వాత ఎప్పుడైనా ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related News