TG EAPCET 2025: ఈ నెల 11న తెలంగాణ ఈఏపీసెట్‌ పలితాలు విడుదల!

తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఆదివారం (మే 11) విడుదల కానున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

జేఎన్‌టీయూ, ఉన్నత విద్యా శాఖ అధికారులు ఈఏపీసెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు పొందిన ర్యాంకులు, మార్కులను విడుదల అధికారులు వెల్లడిస్తారు. ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ప్రవేశ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. వ్యవసాయ-ఫార్మసీ విభాగం పరీక్షలు ఏప్రిల్ 29, 30 మధ్య తేదీల్లో జరిగాయి. ఇక మే 2, 3, 4 మధ్య తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరిగాయి. అయితే, ఇంజనీరింగ్‌కు 2,20,327 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 2,07,190 మంది పరీక్ష రాశారు. వ్యవసాయ రంగంలో 86,762 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 81,198 మంది రాశారు. ఇప్పటికే ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఈ ఏడాది కూడా ఈఏపీసెట్ పరీక్షలు జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగాయి.

Related News