అమరావతి: రాష్ట్ర విద్యాశాఖ పాఠశాల విద్యా సఖ కి ‘లీప్ యాప్’ హాజరును తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ నిర్దేశిత సమయాల్లో ఈ యాప్ ద్వారానే హాజరు వేయా లని సూచించింది.
ఈ నెల నుంచి లీప్ యాప్ హాజరు నివేదిక ఆధారంగా వేతనాన్ని ఖచ్చితంగా లెక్కించనున్నారు. ప్రస్తుత నెలకు పాఠశాల విద్య డైరెక్టరేట్ జీతం ఇస్తుందని సోమవారం పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని సెలవు లను లీప్ యాప్లో మాత్రమే సమర్పించాల న్నారు. యాప్లో హాజరు నమోదు కాకుంటే ఆరోజు సెలవుగా పరిగణించి, ఆ మేరకు వేతనం లో కోత విధించనున్నారు.
ఈ మేరకు చీఫ్ అకౌం ట్స్ ఆఫీసర్లు, ఏఏవోలు మే నెల జీతం బిల్లును ప్రాసెస్ చేసే ముందు సంబంధిత విభాగాల నుం చి హాజరు నివేదికలను తీసుకోవాలని డైరెక్టర్ ఆదే శించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయ సిబ్బందికి పరిమితం చేయగా, త్వరలో ఉపాధ్యాయులకు కూడా వర్తిం పజేయనున్నట్టు సమాచారం.