Teachers Promotions: మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు. CSE AP
ఉపాధ్యాయ పదోన్నతుల కోసం మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాలు తయారు చేస్తామని విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ జాబితాలలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని వారు తెలిపారు.
విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు గురువారం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై సంఘాలు లేవనెత్తిన సందేహాలను ఆయన స్పష్టం చేశారు.
ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ నుండి హెడ్‌మాస్టర్ వరకు పదోన్నతికి అర్హులైన అన్ని SAల సీనియారిటీ జాబితాను ప్రదర్శిస్తామని ఆయన చెప్పారు. కోర్టు కేసు ఆధారంగా DEO పూల్ పండిట్‌ల పదోన్నతిని ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు.
మోడల్ ప్రాథమిక పాఠశాలలను పేరెంట్ కమిటీల నిర్ణయం ప్రకారం మాత్రమే ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతానికి హైస్కూల్ ప్లస్ కొనసాగించాలని నిర్ణయించామని ఆయన అన్నారు.