ఏపి కమిషనేర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారితో ఉపాధ్యాయ సంఘాలు నేడు ( 03-01-2025) జరిపిన సమావేశంలోని ముఖ్యాంశాలు ఈ కింది విధం గా ఉన్నాయి. ..
టీచర్ల Transfers యాక్ట్ కు సంబంధించి ఇంకా ఏమైనా ప్రతిపాదనలు ఉంటే వెంటనే తెలియజేయాలని వచ్చే శుక్రవారం నాటికి డ్రాఫ్ట్ ఫైనలైజ్ చేస్తామని తెలిపారు.
ట్రాన్స్ఫర్స్ యాక్ట్ ను ఫిబ్రవరి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెడతామని తెలిపారు. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ పూర్తికాగానే బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. అకడమిక్ ఇయర్స్ పై చర్చ జరిగింది. మినిమం జీరో సర్వీస్ ను పరిగణించాలని కోరడం జరిగింది.
TIS అప్డేషన్ లో టెక్నికల్ సమస్యలు సరిచేస్తామని, సంక్రాంతి వరకు గడువు ఇస్తామని తెలిపారు.
117 జీవో డ్రాఫ్ట్ ఫైనలైజ్ చేసామని, క్షేత్రస్థాయిలో అధికారులతో కూడా కమిషనర్ గారు భౌతికంగా సమావేశాలు పెట్టి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు.
భవిష్యత్తులో కోర్టు కేసులు రాకుండా ఉండడానికే అకడమిక్ ఇయర్స్ గా తీసుకోవడం లేదని తెలిపారు.
సంక్రాంతి సెలవుల తర్వాత DSC నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలండర్ ను ఫిబ్రవరి నెలలోనే ఫైనల్ వచ్చేసి సకాలంలో అందజేస్తామన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం 10వ తరగతి సిలబస్ నవంబర్ కు పూర్తిచేసేలా అకడమిక్ క్యాలండర్లో పొందుపరుస్తామన్నారు.
అకడమిక్ క్యాలండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం కూడా తీసుకుంటామన్నారు.
పాఠ్యపుస్తకాలలో ముఖ్యంగా హిందీ సబ్జెక్టుకు సంబంధించి 9, 10 తరగతుల పాఠ్యాంశాలు కొన్ని తొలగించి ముద్రిస్తామన్నారు.
మిగిలిన సబ్జెక్టుల విషయంపై కూడా చర్చిస్తున్నామన్నారు.
ప్రిఫరెన్షియల్ క్యాటగిరిలో Visually Handicapped వారికి 60 % దాటితే ప్రిపరెన్షియల్ కేటగిరి, 75 % ఉంటే exemption గా పరిగణించాలని కోరడం జరిగింది. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ లో కనీసం 2 సం.లు యూనిట్ నిర్వహించిన వారికి మాత్రమే పాయింట్లు ఇస్తామన్నారు.
డీఈవో పూల్ లో పండితుల కోర్టు కేసులో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వెంటనే ప్రమోషన్లను ఇవ్వాలని కోరగా లీగల్ డిపార్ట్మెంట్ వారి నిర్ణయం ప్రకారం చేస్తామన్నారు.
అంతర్ జిల్లా బదిలీలను కూడా స్ఫౌజ్, మ్యూచువల్ లతోపాటు సాధారణ అంతర్ జిల్లా బదిలీలు కూడా చేపట్టాలని కోరడం జరిగింది.
ఎయిడెడ్ నుంచి విలీనం అయిన వారికి 50 % సర్వీస్ ఇవ్వాలని, మున్సిపాలిటీలలో మిగిలిన స్థానాలకు వారికి ప్రమోషన్ ఇవ్వాలని కోరడం జరిగింది.
ముఖ్యంగా పర్ఫార్మెన్స్ పాయింట్లు గురించి చర్చించి జాతీయస్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్, స్పోర్ట్స్ గేమ్స్ వారికి, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ లో రాష్ట్రపతి పతాకముకు ఎన్నిక అయ్యేవారికి ఇచ్చే విషయం ఆలోచించాలన్నారు.