Teacher Transfers 2025: ఉపాధ్యాయుల బదిలీల మీద కీలక అప్డేట్. .

ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం-2025 అమల్లోకి వచ్చింది. ఈ నెల 9 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇక మీదట Act లోని నిబంధనల ప్రకారం మాత్రమే టీచర్ల బదిలీలు జరుగుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఏటా వేసవి సెలవుల్లో మాత్రమే ట్రాన్స్ఫర్లు చేస్తారు. గతంలో ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో బదిలీలు జరిపేవారు. . దానికి నిర్దేశిత సమయం లేకపోవడంతో న్యాయ వివాదాలు ఏర్పడి ప్రతిసారీ వాయిదాలు పడుతూ ఆలస్యం జరిగేది. అలాంటి గందరగోళ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం టీచర్ల బదిలీల అంశంపై ఒక చట్టం చేసింది.

ఈ ఏడాది మే నెలలో టీచర్ల బదిలీలు జరుగుతాయి. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు విడుదల చేసింది.

Related News

తాజాగా ఉపాధ్యాయుల బదిలీలలో preferential క్యాటగిరి కొరకు ఎవరైనా వాడుకోవాలి అనుకుకంటే అట్టి వారికోసం జిల్లా మెడికల్ బోర్డు లో సర్టిఫికెట్ కొరకు అనుమతి ఇస్తూ ఈ నెల అంటే ఏప్రిల్ 24 నుంచి 26 వరకు 3 రోజుల పాటు ఇవ్వుటకు పాఠశాల విద్యా శాఖ నుంచి మెడికల్ బోర్డు వారికీ ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి.

కాబట్టి సదరు ఉపాధ్యాయులు సంబంధిత జిల్లా మెడికల్ బోర్డు కి ఆయా తేదీలలో అటెండ్ అయి వారి సర్టిఫికెట్ లు పొందవలసింది గా కోరి ఉన్నారు ..

Download Govt memo on Medical Certificates to Teachers