అమరావతి: విజయవాడలోని మొగల్రాజపురం BSRK ఉన్నత పాఠశాల ఉపాధ్యా యుడు.. స్కూల్ వాట్సాప్ గ్రూప్ లోని మెసేజ్ లు చూడడం లేదని ఆయనను సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది.
దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే సస్పెన్షన్ను రద్దు చేయాలంటూ.. జిల్లా విద్యాశాఖ అధికారులకు యూటీ ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు.
తనకు కంటి సంబంధిత సమస్య ఉండడంతో స్మార్ట్ మొబైల్ వాడొద్దని వైద్యులు సూచించారని రమేష్ వివరణ ఇచ్చినా.. వ్యక్తిగత విషయాన్ని సాకుగా చూపిస్తూ సస్పెండ్ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
Related News
దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు మాట్లా డుతూ.. వాట్సప్ గ్రూపు నుంచి రమేష్ అకస్మాత్తుగా వెళ్లి పోవడం, విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం, కంటి సమస్య ఉన్నట్లు వైద్యులు సూచించిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని కోరినా స్పందించకపోవడం వల్లే ఆయ నపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.