విద్యార్థులకు విద్యా బోధన చేయాల్సిన ఉపాధ్యాయుడు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. విద్యార్థులు నవ్వారని చెప్పి, ఉపాధ్యాయుడు తన చెప్పుతో కొట్టాడు. ఈ సంఘటన అచ్చంపేట నియోజకవర్గం, బల్మూర్ మండలం, కొండనాగులపల్లిలోని జెడ్‌పి ఉన్నత పాఠశాలలో వెలుగులోకి వచ్చింది.
ఈ ఉదయం పాఠశాల ఆవరణలో ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు. అటుగా వెళ్తున్న శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు ముగ్గురు బాలికలు తనను చూసి నవ్వుతున్నారని భావించి వారితో అనుచితంగా ప్రవర్తించాడు. అతను తన చెప్పును తీసుకొని ముగ్గురు విద్యార్థులపై విసిరాడు. దీనితో విద్యార్థుల మెడ మరియు చెవులకు గాయాలు అయ్యాయి.
బాధిత విద్యార్థులు ఈ సంఘటన గురించి తమ తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు గుమిగూడి పాఠశాల ఆవరణలో శ్రీనివాస్ రెడ్డికి దేహ శుద్ధి చేసారు. తల్లిదండ్రులు మరియు స్థానికులు శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని MEO కు ఫిర్యాదు చేశారు. DEO ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని MEO పేర్కొన్నారు.