పిల్లల నోటి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోతే, వారికి దంతాలలో పుచ్చులు ఏర్పడవచ్చు, వారి చిగుళ్ళు కూడా వాచిపోవచ్చు. ఇది మాత్రమే కాదు.. దంత సమస్యలు పెరిగితే అది వారి మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా.. వారు గుండె జబ్బులు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు వంటి సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. పిల్లలకు చిన్నప్పటి నుండే పళ్ళు తోముకోవడం, సరిగ్గా తినడం అలవాటు చేస్తే, వారి దంతాలు బలంగా ఉంటాయి. వ్యాధుల నుండి వారిని వారు రక్షించుకోవచ్చు. ఈ క్రమంలో చిన్నప్పటి నుండే పిల్లలకు నోటి ఆరోగ్యానికి సంబంధించిన ఈ 7 అలవాట్లను నేర్పించాలి. దీంతో వారు ఎంతో ఆర్యోగంగా ఉంటారు.
దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకునే అలవాటు
Related News
పిల్లలకు రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం అలవాటు చేయాలి. అది ఉదయం పూట, పడుకునే ముందు. బ్రష్ చేసేటప్పుడు, దంతాల ప్రతి భాగాన్ని పూర్తిగా శుభ్రం చేయించాలి. దీని కోసం, మీరు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టూత్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌లను ఉపయోగించవచ్చు.
పడుకునే ముందు పళ్ళు తోముకునే అలవాటు
నిద్రపోయే ముందు బ్రష్ చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సమయంలో నోటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం అలవాటు చేసుకోండి.
స్వీట్లు తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకునే అలవాటు
చిన్న పిల్లలకు స్వీట్లు అంటే ఎంతో ఇష్టం. స్వీట్లు తిన్న తర్వాత, నోటిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇది దంతాలకు ఎంతో హానికరం. కాబట్టి, స్వీట్లు తిన్న తర్వాత నోరు కడుక్కోవడం అలవాటు చేయించాలి.
నాలుకను శుభ్రపరిచే అలవాటు
నాలుకపై బ్యాక్టీరియా కూడా పేరుకుపోతుంది. కాబట్టి దంతాలతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు టంగ్ క్లీనర్ తో నాలుక శుభ్రం చేసుకునే అలవాటును పెంచవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం వల్ల వారి దంతాలు బలంగా ఉంటాయి. పిల్లలు పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు వంటివి తినేలా ప్రోత్సహించండి.
క్రమం తప్పకుండా దంత తనిఖీ
ప్రతి 6 నెలలకు ఒకసారి పిల్లలను దంతవైద్యుని వద్దకు తీసుకెళ్లండి. వైద్యుడు మీ బిడ్డ దంతాలను పరిశీలించి, ఏవైనా సమస్యలను నిర్ధారిస్తారు.
గమనిక: ఇంటర్నెట్ నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సమాచారం మీకు అందించబడింది. ఇందులోని విషయాలు అవగాహన కోసం మాత్రమే.