Honda: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాన్స్ కు షాక్.. హోండా నుంచి వచ్చిన క్రూయిజర్ బైక్ చూసి ఫ్యాన్స్ ఔరా అంటున్నారు…

బైక్ ప్రియులకు ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. హోండా నుంచి వచ్చిన కొత్త క్రూయిజర్ బైక్ – రెబెల్ 500. రాయల్ ఎన్‌ఫీల్డ్ వాడేవాళ్లు కూడా ఈ బైక్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎప్పటినుంచో హోండా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ బైక్ ఇప్పుడు ఇండియా మార్కెట్‌లో అడుగుపెట్టింది. రెట్రో స్టైల్ క్రూయిజర్ బైక్‌కి మోడరన్ టచ్ ఇచ్చి, మస్త్ లుక్స్‌తో తీసుకొచ్చింది హోండా. ఇది కేవలం బైక్ మాత్రమే కాదు.. ఇది ఒక స్టేటస్ సింబల్‌గా మారబోతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇండియాలో ఈ బైక్ ధరను రూ.5.12 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. ఇది తక్కువ కాదు కానీ ఈ బైక్‌కి ఇచ్చే విలువ చూస్తే ధర చాలానే రీజనబుల్ అని ఫీల్ అవుతారు. ఇప్పటికే గురుగ్రామ్, ముంబై, బెంగళూరులోని కొన్ని ఎంపిక చేసిన బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. డెలివరీలు జూన్ 2025 నుండి ప్రారంభమవుతాయి. అంటే ఇంకొన్ని రోజుల్లో రోడ్లపై ఈ బైక్ దర్శనమివ్వబోతోంది.

హోండా రెబెల్ 500 బైక్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుగాంచింది. ఇప్పుడు అదే బైక్‌ను ఇండియాలో కూడా ప్రవేశపెట్టారు. ఇది హోండా ప్రీమియం బైక్స్ లైన్‌లో భాగంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్. ఈ బైక్‌లో బ్లాక్ అవుట్ డిజైన్, మాస్ లుకింగ్ ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ LED హెడ్‌ల్యాంప్ ఉన్నాయి. బైక్ కూర్చునే సీటు ఎత్తు కేవలం 690 mm మాత్రమే. ఈ సీటు ఎత్తు వల్ల షార్ట్ హైట్ రైడర్స్‌కి కూడా ఇది కంఫర్ట్‌గా ఉంటుంది. స్టెయిలిష్ లుక్స్‌కి కాంపాక్ట్ బాడీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ బైక్ ఇప్పుడు యువతను బాగా ఆకర్షిస్తోంది.

హోండా రెబెల్ 500 బైక్‌లో 471cc లిక్విడ్ కూల్డ్ టు సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతోంది. ఈ ఇంజిన్ 8,500 RPM వద్ద 34 కిలోవాట్ల పవర్, 6,000 RPM వద్ద 43.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మామూలుగా చెప్పాలంటే.. ఈ బైక్ ఓనర్స్‌కి స్పీడ్, పవర్ రెండూ బాక్సాఫీస్ లెవెల్‌లో ఉంటాయి. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. నెమ్మదిగా డ్రైవ్ చేసినా.. స్పీడ్‌లో ఊపు వచ్చినా.. బైక్ బలమైన టార్క్ డెలివరీ ఇస్తుంది.

ఈ బైక్‌లో డిజైన్, ఇంజిన్‌కి తోడుగా అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌తో నిర్మించబడిన ఈ బైక్ ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు 296 mm డిస్క్ బ్రేక్, వెనుక 240 mm డిస్క్ బ్రేక్ ఉన్నాయి. వీటికి తోడుగా డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా ఇచ్చారు. అంటే బ్రేకింగ్ సమయంలో రైడర్‌కి భయం లేకుండా, సేఫ్‌గా ఉంటుంది. 16 అంగుళాల టైర్లతో మంచి రోడ్ గ్రిప్ కూడా కలుగుతుంది.

అంతేకాకుండా, ఈ బైక్‌లో LCD డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో బైక్ గురించి ముఖ్యమైన సమాచారం – స్పీడ్, ట్రిప్, ఫ్యూయల్ లెవల్ వంటి వివరాలు క్లియర్‌గా కనిపిస్తాయి. ఇది క్రూయిజర్ బైక్ అయినా స్పోర్టీ లుక్ ఇచ్చే డాష్‌తో వావ్ అనిపిస్తుంది. ఇక ఎగ్జాస్ట్ సౌండ్ గురించి చెప్పాలంటే.. మోటో లవర్స్‌కి ఇది పండగే. మోడు టోన్ సౌండ్‌తో రోడ్డుపై వెళ్తుంటే అందరూ తిరిగి చూడాల్సిందే.

ఈ బైక్ ప్రస్తుతం ఇండియాలో అన్ని హోండా షోరూమ్‌లలో లేదు. ఇది కేవలం గురుగ్రామ్, ముంబై, బెంగళూరులో ఉన్న బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌లలో మాత్రమే విక్రయించబడుతోంది. బుకింగ్ కోసం మీరు ఆ నగరాల్లో ఉన్న హోండా బిగ్‌వింగ్ షోరూమ్‌కి వెళ్లవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ డెలివరీలు జూన్ 2025 నుండి ప్రారంభమవుతాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

హోండా రెబెల్ 500 మార్కెట్‌లోకి రావడం ఒక్కటే కాకుండా.. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్, కవాసకి వంటి బ్రాండ్స్‌కి పెద్ద చాక్మా ఇచ్చేలా ఉంది. ప్రత్యేకంగా షాట్‌గన్ 650, సూపర్ మీటియర్ 650, ఎలిమినేటర్ 500 వంటి మోడల్స్‌తో గట్టిగా పోటీ ఇవ్వబోతోంది. దీని లుక్స్, ఫీచర్లు, డిజైన్, టెక్నాలజీ అన్నీ చూసిన తర్వాత బైక్ లవర్స్ డైలమాలో పడిపోతున్నారు – ఎన్‌ఫీల్డ్ కొనాలా, రెబెల్ 500కి ఓటేయాలా అని!

ఇక మొత్తానికి చెప్పాలంటే.. హోండా రెబెల్ 500 బైక్ వొచ్చేసింది. ఇది కేవలం ఓ మోటార్ సైకిల్ కాదు.. యువతలో ఒక క్రేజ్ క్రియేట్ చేస్తోంది. ఈ బైక్ రోడ్లపై పరుగెడితే చాలు.. అందరి దృష్టి ఆకర్షించకుండా ఉండదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ వాడే ఫ్రెండ్స్‌కి ఇది షాక్‌లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా స్టేటస్ చూపించాలంటే.. రెబెల్ 500 వాడాల్సిందే!

ఇంకెందుకు ఆలస్యం? ఈ బైక్ బుక్ చేసుకోవడం ఆలస్యం చేస్తే.. తరువాత క్యూ లో నిల్చోవాల్సిందే!