దూసుకొస్తున్న తుఫాను!.. కోస్తాఆంధ్రాకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ అల్పపీడనంగా మారింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

రేపటికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీంతో ఈ తుపాను ప్రభావం ఏపీపై పడనుంది. ఏపీ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

కోస్తాంధ్ర, రాయలసీమల్లో మూడు రోజులు వర్షాలు 

Related News

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ, ఉత్తర కోస్తాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రభావం ఏపీలోని కోస్తా ఆంధ్రపై ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

తుపాను ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది

ప్రస్తుతం తుపాను ట్రింకోమలీకి 600 కి.మీ, నాగపట్నం నుండి 880 కి.మీ, పుదుచ్చేరికి 980 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత మరో 2 రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రానున్న 24 గంటల్లో తీవ్ర తుపాను… హెచ్చరిక

మూడు రోజుల పాటు రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

దక్షిణ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం గత 3 గంటల్లో 30 కి.మీ వేగంతో కదులుతున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆయన వివరించారు.

నంబర్ వన్ ప్రమాద హెచ్చరిక

తాజా హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. రేపు దక్షిణ కోస్తాలో గంటకు 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఎల్లుండి నుంచి 55-75 కి.మీ. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీర ప్రాంతాల్లో నంబర్ వన్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మరో నాలుగు రోజులు వర్షాలు

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *