
ఇప్పుడు దేశంలో విద్యావంతులైన యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే, ప్రభుత్వమే వారిని వ్యాపారం వైపు ప్రోత్సహిస్తోంది. ఉద్యోగాలు తగ్గుతున్న ఈ కాలంలో, ఒక చిన్న పెట్టుబడితో మొదలుపెట్టి, నెలలు గడిచేకొద్దీ మంచి ఆదాయాన్ని పొందగలిగే వ్యాపారం కోసం వెతుకుతున్నారా? అయితే మీ కోసం ఇదే సరైన వ్యాపారం.
ఇప్పుడు చెప్పబోతున్న వ్యాపారం ఎవరికైనా సూటవుతుంది. మహిళలు ఇంట్లో నుంచే మొదలుపెట్టవచ్చు. పురుషులు గ్రామంలో, పట్టణంలో ప్రారంభించవచ్చు. ఇది ఎప్పుడూ డిమాండ్ తగ్గే రంగం కాదు. ఈ వ్యాపారానికి ఎప్పుడూ నిలకడగానే డిమాండ్ ఉంటుంది.
ఈ వ్యాపారంలో మీరు గోధుమలు, జొన్నలు, మినుములు, సజ్జలు, మక్క వంటి ధాన్యాలను కొనుగోలు చేసి వాటిని మెత్తగా గ్రైండ్ చేసి ప్యాకింగ్ చేసి విక్రయించాలి. గ్రామ ప్రాంతాల్లో రా మెటీరియల్ అంటే ధాన్యాలు సులభంగా లభిస్తాయి. వీటిని వర్షాకాలానికి ముందే స్టాక్ చేసి నిల్వచేసుకోవచ్చు. అప్పుడు ధరలు పెరిగినా, మీకే లాభం. పిండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు కొంత machinery కొనాలి. ఇవి ఒకసారి కొంటే చాలాసేపు పని చేస్తాయి. ప్రారంభంలో మీరు తీసుకోవలసిన యంత్రాలు, వాటి ఖర్చు ఇలా ఉంటుంది:
[news_related_post]గోధుమల పిండి మెషిన్ (Pulvariser) – ₹16,600
డబుల్ స్టేజ్ పుల్వరైజర్ – ₹17,800
రోస్టర్ – ₹20,500
గ్యాస్ కనెక్షన్ – ₹10,000
వెయింగ్ స్కేల్ – ₹8,000
సీలింగ్ మెషిన్ – ₹3,000
ప్యాకింగ్, స్టోరేజ్‌కు అవసరమైన పాత్రలు – ₹6,000
ఇవి కలిపితే మొత్తం పెట్టుబడి సుమారుగా ₹80,000 నుంచి ₹90,000 మధ్య ఉంటుంది. మీరు చిన్న స్థాయిలో మొదలుపెడుతున్నట్లయితే, కొంతమందికి ఇది ఇంకా తక్కువలో కూడా మొదలుపెట్టే అవకాశం ఉంటుంది.
మీరు machinery సెట్ చేసిన తర్వాత రోజూ మీరు ఎంత పిండి తయారు చేయాలో వినియోగదారుల డిమాండ్ చూసి నిర్ణయించవచ్చు. స్థానిక షాపులకు, కిరాణా దుకాణాలకు లేదా నేరుగా కస్టమర్లకు సరఫరా చేయవచ్చు. మంచి ప్యాకింగ్, నాణ్యమైన గ్రైండింగ్ ఉంటే mouth publicity ద్వారానే మంచి కస్టమర్లను పొందవచ్చు.
ఒక నెలలో మీరు సుమారు ₹1,15,000 వరకు విక్రయాలు చేస్తే, దానికి అనుగుణంగా కరెంట్ బిల్లు, ముడి సరుకు, కార్మిక ఖర్చులు కలిపి ₹1,05,000 వరకు ఖర్చవుతుంది. మిగిలిన ₹10,000 లాభంగా మిగులుతుంది. ఇది చిన్నస్థాయి లాభం అనిపించినా, ప్రారంభ దశకు ఇది చాలు. తర్వాత క్రమంగా మూడింతలు నలుగింతలు లాభం పెరిగే అవకాశం ఉంటుంది.
మీ వద్ద ప్రారంభ పెట్టుబడి లేకపోతే, మీరు కేంద్ర ప్రభుత్వ Mudra Yojana లేదా PMEGP (Prime Minister’s Employment Generation Programme) schemes ద్వారా రుణం పొందవచ్చు. ఇందుకోసం మీ జిల్లా పరిశ్రమల శాఖ లేదా బ్యాంకులను సంప్రదించాలి. మంచి బిజినెస్ ప్లాన్ చూపించగలిగితే బ్యాంకు రుణం ఇవ్వడం సులభమే.
ఇలాంటి బిజినెస్ మీరు ఒకే ఒక్కసారి machinery సెట్ చేసి మొదలుపెడితే, తర్వాత ఎక్కువగా ఖర్చు ఉండదు. మీరు ఇంట్లో నుంచే నిర్వహించవచ్చు. రోజుకు 2-3 గంటలు పనిచేస్తే చాలిపోతుంది. డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. రొట్టె తినే ప్రజలు ఉన్నంత వరకు ఈ వ్యాపారం నడుస్తూనే ఉంటుంది. ఒక్కసారి ₹80,000 పెట్టుబడి పెడితే, నెలకు కనీసం ₹10,000 ఆదాయం గ్యారంటీగా వస్తుంది. ఇది ఫిక్స్డ్ జీతం కాకపోయినా, మీ కష్టాన్ని బట్టి ఆదాయం పెరిగే అవకాశముంది. పైగా ప్రభుత్వ రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకండి. ఉద్యోగం లేక భవిష్యత్తుపై గందరగోళంగా ఉన్నప్పుడు, ఇదే సరైన సమయం… మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించండి.