
భారతదేశంలో ఇప్పుడు చిన్న పెట్టుబడి తో బిజినెస్ మొదలుపెట్టే అవకాశాలు ఎప్పటికంటే ఎక్కువగా ఉన్నాయి. పాత రోజుల్లోలా లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఇక లేదు. ఇప్పుడు చిన్నగా ఆరంభించి, మీ ప్యాషన్‌కి తగిన రీతిలో గట్టి కష్టం చేస్తే, మీరు లక్షల్లో సంపాదించవచ్చు. కేవలం ఐడియా, డెడికేషన్, పట్టుదల ఉంటే చాలు – సొంతగా ఎదగవచ్చు. ఇప్పుడు మీరు చదివే ఐదు బిజినెస్ ఐడియాలు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చు.
1. మొబైల్ తోనే ఆదాయం – డిజిటల్ మార్కెటింగ్ & కంటెంట్ క్రియేషన్
ఇప్పుడు డిజిటల్ యుగం. అందుకే YouTube, Instagram, బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. మీకు వీడియోలు తీయడం, ఎడిట్ చేయడం, రాయడం, డిజైన్ చేయడం నచ్చితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. ప్రారంభంలో మీరు ఒక మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్‌తో YouTube ఛానెల్ మొదలు పెట్టొచ్చు. మీరు ఫ్రీలాన్సింగ్గా పనిచేసి మొదట నెలకు ₹15,000 నుండి ₹50,000 వరకూ సంపాదించవచ్చు. ఆ తరువాత బ్రాండ్‌గా మారితే లక్షల్లో ఆదాయం సాధ్యమే.
2. పెళ్లిళ్లు…పెద్ద బిజినెస్ అవుతున్నాయి – వెడ్డింగ్ ప్లానింగ్
భారతదేశంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఖర్చు చేయడంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఇప్పుడు టైం లేకపోవడం వల్ల చాలామంది ప్రొఫెషనల్స్‌ని హైర్ చేస్తున్నారు. మీరు చిన్న ఈవెంట్ ప్లానింగ్‌తో మొదలుపెట్టండి. కేటరింగ్, ఫ్లోరల్ డెకరేషన్, వెన్యూ బుకింగ్ వంటి సేవలతో మొదలుపెట్టి నెట్వర్క్ పెంచుకుంటే, ఒక్క ఈవెంట్‌కి ₹50,000 నుండి ₹2 లక్షల వరకు సంపాదించవచ్చు.
3. ఇంట్లోనే రుచులు – హోమ్ ఫుడ్ & బేకరీ బిజినెస్
ఇప్పుడు హోమ్మేడ్ ఫుడ్‌కి డిమాండ్ బాగా ఉంది. ఫ్రెష్‌గా ఉండే టిఫిన్లు, పిక్కెల్స్, కేక్స్, కుకీలు కొనే వారు బాగా పెరిగారు. మీరు ఇంట్లోనే చిన్నగా టిఫిన్ సర్వీస్ లేదా బేకరీ ఉత్పత్తులతో స్టార్ట్ చేయవచ్చు. మొదట్లో ₹10,000 లోపు పెట్టుబడి చాలు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కస్టమర్లు సంపాదించవచ్చు. నెలకు ₹20,000 నుండి ₹1 లక్ష వరకూ ఆదాయం సాధ్యం.
4. ఆరోగ్యమే మహాభాగ్యం – ఫిట్నెస్ & యోగా కోచింగ్
హెల్త్ మీద కేర్ తీసుకునే ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అందుకే యోగా, ఫిట్నెస్ ట్రైనింగ్‌కి డిమాండ్ పెరుగుతోంది. మీకు ఫిట్నెస్ మీద ఆసక్తి ఉంటే, ప్రాథమిక ట్రైనింగ్ తీసుకుని, సర్టిఫికేషన్‌తో స్థానికంగా లేదా ఆన్లైన్లో క్లాసులు మొదలు పెట్టండి. నెలకు ₹20,000 నుండి ₹50,000 వరకూ ఆదాయం రావచ్చు. మీరు డిజిటల్ ప్రెజెన్స్ పెంచుకుంటే ఈ ఆదాయం మరింతగా పెరిగుతుంది.
5. చిన్న పెట్టుబడి – పెద్ద ఆదాయం : అగర్భత్తి & క్యాండిల్ తయారీ
ఫెస్టివల్ సీజన్లో అగర్భత్తులు, క్యాండిల్స్‌కి బాగా డిమాండ్ ఉంటుంది. ఇది చాలా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే బిజినెస్. ₹5,000 నుండి ₹20,000 వరకు పెట్టుబడి చేస్తే, మిషన్, రా మెటీరియల్‌తో స్టార్ట్ చేయవచ్చు. మీ ఉత్పత్తులను స్థానిక మార్కెట్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో విక్రయించండి. నెలకు ₹30,000 నుండి ₹1 లక్ష వరకూ ఆదాయం సాధ్యమే.
ఈ ఐదు బిజినెస్ ఐడియాలు కేవలం ప్రారంభం మాత్రమే. మీలో ప్యాషన్, కృషి చేసే తపన, కొత్తగా ఆలోచించే ధైర్యం ఉంటే – మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు. మొదటి అడుగు వేయడమే పెద్ద పని. ఏ బిజినెస్ అయినా మొదట చిన్నగా ఆరంభమవుతుంది. కానీ మీరు విశ్వాసంతో కృషి చేస్తే, అది మీ జీవితాన్ని మార్చేస్తుంది.