అమరావతి: 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ పేరులోని తప్పులను సరిదిద్దుకునేందుకు (Nominal rolls correction) ఈ నెల 19 నుంచి 23 వరకు అవకాశం కల్పించారు. పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశామని, తప్పులుంటే సరిచేయాలని పాఠశాల విద్యాశాఖ కోరింది.
ఈ విషయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.
ఇప్పటికే సమర్పించిన నామినల్ రోల్స్‌లో విద్యార్థి, తల్లిదండ్రులు, పుట్టిన తేదీ మరియు మాధ్యమం పేర్లను సవరించవచ్చు.
ప్రధానోపాధ్యాయులు తమ ఆన్‌లైన్ లాగిన్ ద్వారా ఈ సవరణలను చేయవచ్చు. ఇందుకోసం AAPAR వివరాలతో మరోసారి విద్యార్థుల వివరాలను పరిశీలిస్తారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1, 2025 వరకు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్షల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో తరగతులు నిర్వహిస్తోంది.