Soaked Peanuts : వేరుశనగ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది వాటిని తినడానికి ఇష్టపడతారు. వీటిని పేదల జీడిపప్పు అని కూడా అంటారు.
కానీ జీడిపప్పులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలన్నీ ఈ పల్లీల్లోనే ఉన్నాయి. కానీ చాలామంది ఈ వేరుశెనగలను నానబెట్టి తి0టారు. ఈ పల్లీలను నానబెట్టి తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
పల్లీలను నానబెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి నానబెట్టిన పల్లీలను తీసుకుంటారు.
Related News
ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది. నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గుతుంది. అలాగే చెడు కొవ్వు కరిగి మంచి కొవ్వు పెరుగుతుంది. ఈ నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు.
నానబెట్టిన వేరుశెనగను తినే వారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవే…!
నానబెట్టిన పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పల్లీలను నానబెట్టడం వల్ల మీ గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే జుట్టుకు సరైన పోషకాలు జుట్టును దృఢంగా చేస్తాయి. నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది. ఎందుకంటే. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. నానబెట్టిన పల్లీలో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి…