స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మరియు స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ రెండూ చిన్న కంపెనీల స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే, మ్యూచువల్ ఫండ్‌లో ఫండ్ మేనేజర్ స్టాక్స్‌ను ఎంపిక చేస్తాడు, ఇండెక్స్ ఫండ్‌లో ఒక నిర్దిష్ట ఇండెక్స్‌ని ఫాలో అవుతారు. ఈ రెండు హై రిస్క్ ఫండ్స్, కానీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇకపోతే, ఈ రెండు ఫండ్స్‌లో ఏది ఎక్కువ లాభం ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.
టాప్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ – 5 ఏళ్ల రిటర్న్స్
Quant Small Cap Fund Direct Plan-Growth
- 5 ఏళ్లలో సగటు (CAGR) రిటర్న్ – 52.69%
- AUM: ₹22,832 కోట్లు
- NAV: ₹249.65 (2025 మార్చి 25)
- లాంచ్ డేట్: జనవరి 2013
- ఎక్స్‌పెన్స్ రేషియో: 1.00%
- కనీస SIP: ₹1,000 | కనీస లంప్ సమ్: ₹5,000
₹1 లక్ష 5 ఏళ్లలో ఎంత అయింది?
ఈ ఫండ్‌లో ₹1,00,000 పెట్టుబడి 5 ఏళ్లలో ₹8.3 లక్షలుగా మారింది.
Related News
టాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ – 5 ఏళ్ల రిటర్న్స్
Motilal Oswal Nifty Smallcap 250 Index Fund Direct – Growth
- 5 ఏళ్లలో సగటు (CAGR) రిటర్న్ – 36.69%
- AUM: ₹702 కోట్లు
- NAV: ₹33.86 (2025 మార్చి 25)
- లాంచ్ డేట్: ఆగస్టు 2019
- ఎక్స్‌పెన్స్ రేషియో: 0.36%
- కనీస SIP: ₹500 | కనీస లంప్ సమ్: ₹510
₹1 లక్ష 5 ఏళ్లలో ఎంత అయింది?
ఈ ఫండ్‌లో ₹1,00,000 పెట్టుబడి 5 ఏళ్లలో ₹4.77 లక్షలుగా మారింది
ఇప్పుడు ఏం చేయాలి?
- హై రిస్క్ టోలరెన్స్ ఉన్నవారు స్మాల్ క్యాప్ ఫండ్ ఎంచుకోవచ్చు.
- స్టెడీ రిటర్న్స్ కోరుకునేవారు ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.
- 5+ ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టే ప్లాన్ ఉంటేనే వీటిలో ఇన్వెస్ట్ చేయాలి.
ఇప్పుడు ఏదైనా ఫండ్ మిస్ అయితే, మీ ₹1 లక్ష ₹8 లక్షలు కావాల్సిన అవకాశం కోల్పోతారు. మరింత ఆలస్యం చేయకండి. అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించడం మర్చిపోకండి.