SLBC: SLBC టన్నెల్‌ ఘటన.. రంగంలోకి దిగనున్న ఆ రోబోటిక్ టీమ్..?!

దోమలపెంటలోని SLBC టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించడానికి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ నేటితో 20వ రోజుకు చేరుకుంది. గత 20 రోజులుగా 11 రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే సొరంగం నుండి ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మరో ఏడుగురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్లు కష్టంగా మారుతున్నాయి. ఇప్పటివరకు 13.50 కి.మీ. సొరంగంలోకి వెళ్లిన రెస్క్యూ బృందాలు మరింత ముందుకు వెళ్లలేకపోతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రక్షణ కార్యకలాపాల్లో మరో కీలక పరిణామం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న D1, D2 ప్రాంతాలలో తవ్వకం సాధ్యం కాదు. అయితే, రెస్క్యూ బృందాలు వెళ్లలేని ప్రాంతాలను శోధించడానికి రోబోలను ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. ‘అన్వి’ రోబోటిక్ బృందం రెండు రోబోలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఈ మేరకు, రోబోలు కొద్దిసేపట్లో సొరంగం దగ్గరకు చేరుకుంటాయి. మరోవైపు, కాడవర్ డాగ్ స్క్వాడ్ గుర్తించిన ప్రదేశాలలో రెస్క్యూ బృందాలు ఇంకా తవ్వకాలు జరుపుతున్నాయి.