Secret Camera: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ స్కూల్ డైరెక్టర్ అకృత్యాలకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయులు ఉపయోగించే బాత్‌రూమ్‌లో స్పై కెమెరాను అమర్చి తన కంప్యూటర్‌లో, మొబైల్‌లో పర్యవేక్షించాడు.
ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడా సెక్టార్ 70లోని ఓ ప్లే స్కూల్ డైరెక్టర్‌గా నవనీష్ సహాయ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు.ఈ నెల 10న బాత్‌రూమ్‌లోని బల్బ్ హోల్డర్‌లో స్పై కెమెరాను ఓ టీచర్ గమనించాడు. ఈ విషయాన్ని మహిళా ఉపాధ్యాయురాలు డైరెక్టర్ నవనీష్, స్కూల్ కోఆర్డినేటర్ పారుల్ దృష్టికి తీసుకెళ్లగా వారు తోసిపుచ్చారు.
ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా స్కూల్ డైరెక్టర్ స్పై కెమెరాను అమర్చినట్లు గుర్తించారు.
అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో, నిందితుడు నవనీష్ కెమెరాను ఆన్‌లైన్‌లో రూ. 22,000. అలాగే గతంలో పాఠశాల బాత్‌రూమ్‌లో స్పై కెమెరా కనిపించిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల కోఆర్డినేటర్‌కు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయులు ఆరోపించారు. దీనిపై విచారణ కొనసాగుతుండగా.. పాఠశాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు వెల్లడించారు.