Schools Holiday: ఈనెల 19న పాఠశాలలకు సెలవు.. ఎందుకో తెలుసా?

ప్రభుత్వ సెలవు: విద్యాసంస్థలకు మరో రోజు సెలవు లభించే అవకాశం ఉంది. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నుండి సెలవు ఇవ్వాలని అభ్యర్థనలు వస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రభుత్వం వారి అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. దేశంలో హిందూత్వ సామ్రాజ్యానికి చిహ్నంగా ఉన్న శివాజీ జయంతికి సెలవు ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది డిమాండ్లు చేసే అవకాశం ఉంది.

శివాజీ జయంతికి సెలవు ప్రకటించాలి

Related News

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతి హిందువు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను తెలుసుకోవాలని ఆయన అన్నారు.

19న సెలవు?

శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 చోట్ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు సిడి చవాన్ అన్నారు. మెజారిటీ హిందూ సమాజం మనోభావాలకు అనుకూలంగా ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతి రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. శివాజీపై ఏవైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందా?

శివాజీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించే అవకాశం ఉంది. శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రకు అధికారికంగా సెలవు ఉండగా, తెలంగాణలో కూడా అదే కొనసాగించాలనే డిమాండ్ ఉంది. శివాజీ జయంతి సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవు ఇవ్వాలని తెలంగాణ బిజెపి డిమాండ్ చేస్తోంది. గిరిజన దైవం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఇప్పటికే సెలవు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శివాజీ జయంతి రోజున కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది. సెలవు ఇస్తే, అది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పండుగ వార్త అవుతుంది.