Holidays: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంలో పలు రాష్ట్రాట్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని జిల్లాలో కుండపోత వర్షంతో జనజీవనం అతలాకుతలం అవుతుంది.. మరికొన్ని జిల్లాలో భారీ వర్షలు పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఏపీలోని పలు జిల్లాల్లో నిన్న స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఈ రోజు.. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం,ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి , అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు..
నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఉంటుందని.. భారీ స్థాయిలో వర్ష శాతం నమోదు నేపథ్యంలో సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు. అయితే, తూర్పు గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్.. విద్యార్థులకు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నామని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది యథావిథిగా హాజరుకావాలని ఆదేశించారు.. టీచర్లలో ఈ విషయం మీద గందరగోళం నెలకొన్నది. పిల్లలు లేకుండా ఈ వర్షం లో టీచర్ లు స్కూల్ కి వెళ్లి ఏం చేయాలి అని ప్రశ్నిస్తున్నారు . విద్యార్థులకు సెలవు ప్రకటించిన రోజులను ఇతర ప్రభుత్వ సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు కలెక్టర్..
NTR జిల్లాలో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించింది విద్యాశాఖ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్టు DEO ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. ఇక, భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఆంగన్వాడి కేంద్రాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు..
Related News
ఇక, కృష్ణాజిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు డీఈవో వెల్లడించారు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్కూల్స్ కి ఇవాళ సెలవు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో.. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు.. మరోవైపు.. విశాఖపట్నం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్కూల్స్‌కు సెలవుగా ప్రకటించారు