స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నెలకు రూ.లక్ష వరకు జీతం అందివచ్చే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 23. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..
SBI Recruitment 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ. లక్ష వరకు జీతం
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. ఆధ్వర్యంలో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Related News
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..
- ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 24
- ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 11
- ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 38
- ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 15
- అన్ రిజర్వుడ్ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 62
అర్హత : ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-స్కేల్ II పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
అభ్యర్ధుల వయోపరిమితి: డిసెంబర్ 31, 2024 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 23, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులు: రుసుం చెల్లింపులు జనవరి 23, 2025 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక : ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతం : ఎంపికైన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతంగా చెల్లిస్తారు.
పోస్టింగ్ : హైదరాబాద్, కోల్‌కతాలలో ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.