2025 కొత్త ఆదాయపు పన్ను (Income Tax) విధానం ద్వారా ఏప్రిల్ 1, 2025 నుండి కొత్త ట్యాక్స్ రెజీమ్ అమలులోకి వస్తుంది. దీనిలో అసలైన (Non-Salaried) వ్యక్తులకు ₹12,00,000 వరకు ఆదాయం ట్యాక్స్ (income tax) ఫ్రీ. ఉద్యోగస్తులకు (Salaried Class) ₹12,75,000 వరకు ఆదాయం ట్యాక్స్ (income tax) ఫ్రీ
కానీ, మీ జీతం ₹13,75,000 అయినా కూడా ట్యాక్స్ కట్టకుండా ఉండొచ్చని తెలుసా? ఇది NPS (National Pension System) లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వల్ల సాధ్యమవుతుంది.
₹12,75,000 ఆదాయం ట్యాక్స్ ఫ్రీ ఎలా?
- సెలరీడ్ క్లాస్ వారికి ₹75,000 స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) లభిస్తుంది.
- దీని వలన ట్యాక్సబుల్ ఆదాయం ₹12,00,000 కి తగ్గుతుంది.
- ₹12,00,000 పై లెక్కించిన ట్యాక్స్ ₹60,000 ఉంటుంది, కానీ, రెబేట్ వల్ల ఇది పూర్తిగా మాఫీ అవుతుంది.
- కాబట్టి, ₹12,75,000 ఆదాయం ట్యాక్స్ ఫ్రీ!
NPS కాంట్రిబ్యూషన్ వల్ల ఎంత లాభం?
NPS లో ఉద్యోగి (Employee) మరియు సంస్థ (Employer) ఇద్దరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. కొత్త ట్యాక్స్ రెజీమ్ లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ పై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. మొత్తం 14% వరకు మినహాయింపు పొందొచ్చు.
Related News
₹13,75,000 ఆదాయాన్ని పూర్తిగా ట్యాక్స్ ఫ్రీగా ఎలా మార్చుకోవచ్చు?
- అనుమానించదగిన బేసిక్ పే (Basic Salary) – 50% అంటే ₹6,87,500
- ఈ మొత్తం 14% = ₹96,250 (ఇది ట్యాక్స్ మినహాయింపు పొందే మొత్తం)
- ₹13,75,000 – ₹96,250 = ట్యాక్సబుల్ ఆదాయం (taxable income) ₹12,78,750
- ₹12,78,750 – ₹75,000 (స్టాండర్డ్ డిడక్షన్/standard deduction) = ₹12,03,750
- ₹12,00,000 వరకు ట్యాక్స్ మాఫీ ఉండటంతో ట్యాక్సబుల్ ఆదాయం కేవలం ₹3,750 మాత్రమే!
- దీనిపై 4% cess కలిపి ట్యాక్స్ మొత్తం = ₹3,900 మాత్రమే!
మొత్తంగా చూస్తే:
- ₹13,75,000 ఆదాయం ఉన్నా, కేవలం ₹3,900 మాత్రమే ట్యాక్స్ కడితే సరిపోతుంది!
- మీరు కూడా ఈ ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాన్ని పొందాలంటే, మీ NPS లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ పెంచుకోండి!
మీరు ఇప్పటి వరకు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా? లేదా? కామెంట్ చేయండి