హైదరాబాద్, జనవరి 5: ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది కూడా సంక్రాంతి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులకు సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 5 రోజులు సెలవులు ప్రకటించారు. జనవరి 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది.జనవరి 18న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.జనవరి 11 రెండో శనివారం, 12 ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు ఉంటాయని పేర్కొంది. వీటితో కలిపి మొత్తం 7 రోజులు సెలవులు ఇచ్చారు.
విద్యార్థులు సెలవుల జోష్ నుంచి బయటికి రాక ముందే మళ్లీ సంక్రాంతి సెలవులకు రెడీ అయ్యారు . జనవరి 18 (శనివారం)న పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ 19వ తేదీ ఆదివారం కావడంతో మళ్లీ సెలవు.
Related News
సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాల విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 10వ తరగతి విద్యార్థులకు జనవరి 29లోగా, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28లోగా ఈ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఇప్పటికే పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.