ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సమస్త శాంసంగ్ తన ఫ్లాట్ చీప్ మోడల్ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ అన్ ప్యాక్డ్ పేరుతో అమెరికాలోనే కాలిఫోర్నియాలో భారత కాలం మానం ప్రకారం బుధవారం రాత్రి భారీ ఈవెంట్ను నిర్వహించింది. ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25, ఎస్ 25 అల్ట్రా, ఎస్ 25 ప్లస్ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ లోకి సంబంధించి ఫీచర్లు, ధర, పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
గెలాక్సీ ఎస్ 25 ఆల్ట్రా
ఎస్ 24 అల్ట్రా తో పోలిస్తే ఎస్ 25 ఆల్ట్రా లో అధునాతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 6.9 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లే, 2600 నీట్స్ బ్రైట్నెస్ ఇచ్చారు.120hz రిఫ్రెష్ ఫ్రెష్ రేట్ కూడా ఉంది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఓఎస్ హరిత వన్ యు ఐ 7 తో ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్కు దాదాపు 7 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000mah బ్యాటరీ ఇచ్చారు. అంతేకాకుండా 15 వాట్స్ తో కూడిన వైర్లెస్ ఛార్జింగ్కు సైతం సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే వెనకవైపు నాలుగు కెమెరాలు ఇచ్చారు. 200mp ప్రైమరీ కెమెరా, 50mp అల్ట్రా వైడ్ కెమెరా,50mp టెలిఫోటో కెమెరా, 10mp టెలిఫోటో కెమెరా అమర్చారు. సెల్ఫీల కోసం.. ముందువైపు 12mp కెమెరా ఇచ్చారు. ఎస్ 25 ఆల్ట్రా 3 వేరియంట్లలో లభించునుంది. 12gb ram +256 gb స్టోరేజ్, 12gb ram+512 స్టోరేజ్, 12gb రం+1tb స్టోరేజ్ తో తీసుకొచ్చారు. ధర గురించి మాట్లాడితే.. రూ.129999 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ టైటానియం బ్లాక్, గ్రే, సిల్వర్ బ్లూ, వైట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
గెలాక్సీ s25, ఎస్ 25 ప్లస్
గెలాక్సీ ఎస్ 25, ఎస్ 25 ప్లస్ ఫోన్లు 6.2 అంగుళాల ఫుల్ హెచ్డి డైనమిక్ అమౌంట్ డిస్ప్లే, 120 hz, రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు స్నాప్ డ్రాగన్ 8 లైట్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 వన్ యూ ఐ 7పై పనిచేస్తాయి. 12 gb+256 gb స్టోరేజీ, 512 gb స్టోరేజీ వేరియెంట్లు ఉన్నాయి. ఇక ఎస్ 25 లో 12gb+128gb వేరియంట్ సైతం తీసుకొచ్చారు. ఈ ఫోన్లో కెమెరా గురించి మాట్లాడితే.. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ కెమెరా 50mp,12mp అల్ట్రా వైడ్ కెమెరా, 10mp టెలిఫోటో కెమెరా ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం 12 mp. ఇచ్చారు. దాదాపు ఏడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్డేట్లు కూడా ఇచ్చారు. ఎస్ 25 లో 4000mah బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్స్ కు సపోర్ట్ చేస్తుంది. అయితే చార్జర్ విడిగా కొనుక్కోవాలి. మరోవైపు ఎస్ 25 ప్లస్ లో 45 వాట్స్ సపోర్ట్ తో 4900 బ్యాటరీ వస్తుంది. ఈ ఫోన్లో ధరల గురించి మాట్లాడితే.. ఎస్ 25 ప్రారంభ ధర భారత్ లో రూ.80999 కంపెనీ పేర్కొంది. ఎస్ 25 ప్లస్ బేసిక్ మోడల్ ధర రూ.99999 నుంచి ప్రారంభం అవుతుంది. యుఎస్ మార్కెట్లో ఫిబ్రవరి 7 నుంచి ఈ సిరీస్ ఫోన్లు అందుబాటులో రానున్నట్లు కంపెనీ ప్రకటించింది