రూ. 65వేల OnePlus 12 ఫోన్‌… రూ.17,500లకే OnePlus 12 ఫోన్‌.

చైనీస్ బ్రాండ్ వన్ ప్లస్ కు ఇండియన్ మార్కెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లతో ఈ వన్ ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. అయితే మొదట్లో ఈ వన్ ప్లస్ కంపెనీ ప్రీమియం బడ్జెట్ ను టార్గెట్ చేస్తూ మార్కెట్లో విడుదలైంది. కానీ, ఆ తర్వాత బడ్జెట్ ధరల్లోనే ఫోన్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో అతి తక్కువ ధరకే అధిక ఫ్యూచర్ ఉన్న ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇదిలావుంటే.. ఇటీవల OnePlus 12 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రీమియం సెగ్మెంట్లో తీసుకొచ్చిన ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లను అందించింది. అయితే తాజాగా ఈ వన్ ప్లస్ ఫోన్ ఇప్పుడు మార్కెట్లో భారీ తగ్గింపును ఇస్తుంది. వివరాల్లోకి వెళితే.. వన్ ప్లస్ 12 పేరుతో రూ. 65,000తో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఏకంగా రూ. 17,500లకే కొనుగోలు చేసే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ తగ్గింపును ఎలా పొందాలి? ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇటీవల విడుదల చేసిన One Plus 12, 12 GB మరియు 256 GB స్టోరేజ్ వేరియంట్‌ల ధర రూ. 64,999, కానీ ఇప్పుడు మీరు AmazonPay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఆ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు రూ. 3249 తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు కూడా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ ఫోన్ ధర రూ. 61,750 కలిగి ఉంది. అంతేకాకుండా.. మీ పాత ఫోన్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా తగ్గింపు కూడా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ మీ ఫోన్ పరిస్థితిని బట్టి గరిష్టంగా రూ. 44,250 తగ్గింపు వస్తుంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఫోన్ ను రూ. 17,500లకే సొంతం చేసుకోవచ్చు.

Related News

OnePlus 12 స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే, ఇది 6.82-అంగుళాల QHD+ LTPO ప్రో XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4500 నిట్‌ల గరిష్ట ప్రకాశంవంతంగా కూడా ఉంటుంది. దీనితో పాటు, 120 Hz రిఫ్రెష్ రేట్ అందించబడింది. అంతేకాకుండా, ఇది 64 MP వెనుక కెమెరా మరియు 32 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ అందించబడింది. మొత్తంగా, ఈ ఫోన్ 5400 mAh బ్యాటరీని కూడా పొందవచ్చు. ఇది 80 వాట్స్ సూపర్‌వూక్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50 వాట్స్ ఎయిర్‌వుక్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అలాగే వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపుతో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.