RRB 2025 Exam Dates: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల తేదీలు వెల్లడి..పూర్తివివరాలివే!!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) రైల్వే శాఖలో వివిధ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ మేరకు RRB ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. జూనియర్ ఇంజనీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మరియు మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి CBT 2 పరీక్షను ఏప్రిల్ 22న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ పోస్టుల కోసం నిర్వహించిన ఆన్‌లైన్ రాత పరీక్ష CBT 1 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి మరియు దాదాపు 20,792 మంది అభ్యర్థులు CBT 2 పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన వివరాలను RRB అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (CEL నం. 03/2024) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా, జూనియర్ ఇంజనీర్, కెమికల్ సూపర్‌వైజర్ మొదలైన వారి మొత్తం 7,951 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

APPSC రాత పరీక్షలు పూర్తయ్యాయి.. ఫలితాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలు పూర్తయ్యాయని APPSC మార్చి 27 (శనివారం) ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో NTR హెల్త్ యూనివర్సిటీలో లైబ్రేరియన్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, కాలుష్య నియంత్రణ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ 2 మరియు విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయని తెలిపింది. ఈ పరీక్షలన్నీ మార్చి 24, 27 మధ్య నిర్వహించినట్లు కమిషన్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్షల ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని కూడా తన ప్రకటనలో పేర్కొంది.

Related News