
అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై మాజీ మంత్రి రోజా (RK Roja) జైలుకు వెళ్లడం ఖాయమని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు స్పష్టం చేశారు.
గతంలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఆగస్టు 10 లోపు రోజా జైలుకెళ్లక తప్పదని, ఆమె అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందని రవినాయుడు హెచ్చరించారు.
“క్రీడా మంత్రిగా ఉన్నప్పుడు రోజా ఒక్కటంటే ఒక్క స్టేడియాన్ని కూడా నిర్మించారా? ఆమె నిత్యం తమిళనాడులోనే ఉంటారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు అస్సలు క్షమించరానివి. ధైర్యం ఉంటే భాను ప్రకాష్ సవాల్‌ను స్వీకరించాలి. రోజా వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి” అని రవినాయుడు తీవ్రంగా మండిపడ్డారు.
[news_related_post]