వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవలే విశ్వవిద్యాలయానికి రూ.300 కోట్లు కేటాయించింది. ఈ మేరకు నిధులు కేటాయిస్తూ తెలంగాణ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కోటి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చి వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిన విషయం తెలిసిందే.
Related News
ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వవిద్యాలయంలో రూ.550 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.