Recession: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక.. జాగర్త గా ఉండండి !

రిచ్ డాడ్ పూర్ డాడ్రచయిత ప్రకారం, ప్రపంచం మరొక ఎకనామిక్ క్రాష్ వైపు సాగుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

X (ట్విట్టర్)లో ఒక పోస్ట్లో, కియోసాకి గత ఆర్థిక సంక్షోభాలను సూచిస్తూ,
“1998లో వాల్స్ట్రీట్ LTCMని బెయిల్ అవుట్ చేసింది. 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్స్ట్రీట్ని కాపాడాయి.
2025
లో సెంట్రల్ బ్యాంకులను ఎవరు కాపాడతారు?” అని ప్రశ్నించారు.

1971లో ప్రారంభమైన సమస్య

కియోసాకి ప్రకారం, 1971లో అమెరికా డాలర్ను బంగారు ప్రమాణం నుండి తొలగించడం వలన
ఇప్పటి ద్రవ్య సంక్షోభానికి పునాది పడింది. ఈ నిర్ణయం కరెన్సీలను విలువలేని కాగితపు డబ్బుగా మార్చింది.

ఆయన స్నేహితుడు జిమ్ రికార్డ్స్ $1.6 ట్రిలియన్ల విద్యార్థి రుణాల సంక్షోభం
2025 సంక్షోభానికి ట్రిగ్గర్ అవుతుందని హెచ్చరించారు.

పొదుపుదారులు నష్టపోతారు

కియోసాకి ఫియట్ కరెన్సీల (డాలర్, రూపాయి వంటివి) పై నమ్మకం లేదు.
“25 సంవత్సరాల క్రితం నేను చెప్పినట్లు, ‘పొదుపుదారులు ఓడిపోతారు‘.
నిజమైన ఆర్థిక రక్షణకు బంగారం, వెండి, బిట్కాయిన్లు మాత్రమే సాధనాలు అని పేర్కొన్నారు.

క్రాష్ ప్రారంభమైంది

2012లో తన పుస్తకం రిచ్ డాడ్స్ ప్రాఫసీలో హెచ్చరించిన ఆర్థిక పతనం ఇప్పుడు నిజమవుతోందని ఆయన హెచ్చరించారు.
జాగ్రత్త! మీరు మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నిజమైన ఆస్తులను సేకరించండి అని సలహా ఇచ్చారు.

తుది మాట: కియోసాకి ప్రకారం, 2025 సంక్షోభం తప్పదు. ప్రభుత్వాలు లేదా బ్యాంకులు మనల్ని రక్షించవు.
నిజమైన ఆస్తులు మాత్రమే సురక్షితమైన రక్షణ.

📌 కీ పాయింట్స్:

  • బంగారం/వెండి కొనండి
  • క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టండి
  • ఫియట్ డబ్బు మీద ఆధారపడకండి