ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ Realme ఇండియన్ మార్కెట్లో Realme 14 Pro 5G సిరీస్ లాంచ్ చేసేందుకు సిద్ధం అయింది. Realme కంపెనీ Realme 14 Pro, Realme 14 Pro+ పేరిట కొత్త ఫోన్లను తీసుకురానున్నది. అయితే ఈ రెండు ఫోన్లు మైక్రోసైట్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ Flipkartలో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ జనవరి 16, 2025 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. పెర్ల్ వైట్ మోడల్లో కోల్డ్ సెన్సిటివ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఫోన్‌లు 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటెయ్ నీలి రంగులో మారుతుంది. ఇప్పుడు ఈ సిరీస్ ఫీచర్ల గురుంచి చూద్దాం.
డిస్‌ప్లే, ప్రాసెసర్
Related News
Realme 14 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్లో 6.83 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇక 1.5K రిజల్యూషన్, 3840Hz PWM డిమ్మింగ్‌తో కూడిన క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. పనితీరు కోసం.. ఈ ఫోన్లోసిరీస్‌లో Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ ను అమర్చారు. వెల్లడైన సమాచారం ప్రకారం..రియల్‌మే 14 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉండవచ్చు. మరోవైపు.. ప్రో+ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంటాయి.
కెమెరా
Realme 14 Pro సిరీస్ కెమెరా ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ ఫ్లాష్ కెమెరా సెటప్‌ను కలిగి ఉందనున్నది. Realme 14 Pro 5Gలో 50 MP వెనుక కెమెరా ఉంటుంది. ఇది OIS-సపోర్ట్‌తో వస్తుంది. ఇది కాకుండా.. సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్ f/1.8 ఎపర్చరు, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. ఇందులో సెల్ఫీ కోసం.. 16 MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. మరోవైపు.. Realme 14 Pro+ 5Gలో 50 MP మెయిన్ రియర్ సెన్సార్ ఉంది. 50 MP టెలిఫోటో కెమెరా, 112 డిగ్రీ అల్ట్రావైడ్ షూటర్ ఉందనున్నది. సెల్ఫీ కోసం16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, ధర
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6000 mAh బ్యాటరీతో వస్తాయి. Realme 14 Pro, Realme 14 Pro+ ముసార్ట్ ఫోన్లు AI Snap మోడ్, AI అల్ట్రా క్లారిటీ 2.0, AI HyperRAW అల్గోరిథం వంటి ఫీచర్స్ ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు బికనీర్ పర్పుల్, జైపూర్ పింక్ వంటి కలర్ వేరియంట్‌లలో వస్తాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరను వెల్లడించలేదు. Realme 14 Pro ధర రూ. 26,999గా, Realme 14 Pro+ ధర రూ. 32,999 కు కొనుగోలు చేయవచ్చు అని తెలుస్తోంది.