గోల్డ్ లోన్ తీసుకునేవారికి షాక్.. RBI నిర్ణయంతో పెట్టుబడిదారులు కుదేలు…

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గోల్డ్ లోన్‌పై భారీ మార్పులు తీసుకొస్తోంది. తాజాగా RBI ఓ డ్రాఫ్ట్ నిబంధనలు విడుదల చేసింది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు గోల్డ్ లోన్లు ఇచ్చే విధానంపై వీటిలో కీలక మార్గదర్శకాలు ఉన్నాయి. గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఇది పెద్ద షాక్ లాంటిదే. ఎందుకంటే కొత్త నిబంధనలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఎవరైనా ఈ మార్పుల్ని ముందు నుంచి తెలుసుకోకుండా గోల్డ్ మీద లోన్ తీసుకుంటే పెద్ద సమస్యల్లో పడిపోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కొత్త నిబంధనలు

ఇకపై బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఎవరికైనా గోల్డ్ మీద అప్పు ఇస్తే, మొదట ఆ బంగారం మీద యజమాన్యం ఎవరిది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. బంగారం ఎవరిది అనే ఆధారాలు లేనిపక్షంలో బ్యాంకు అప్పు ఇవ్వదు. మీ దగ్గర బంగారం కొన్న రసీదు లేకపోతే, ఎక్కడినుంచి మీ దగ్గరకి వచ్చిందో స్పష్టంగా రాసి ఇవ్వాలి. అలాంటి డిక్లరేషన్ లేకపోతే అప్పు మంజూరు అయ్యే అవకాశం ఉండదు. అంటే ఇకపై పేరుపై లేని బంగారం మీద లోన్ దొరకడం అసాధ్యం.

RBI తెలిపిన దృష్టికోణం స్పష్టంగా ఉంది. బంగారం, వెండి, వాటితో సంబంధం ఉన్న ETF లేదా మ్యూచువల్ ఫండ్‌ల మీద కూడా అప్పులు చాలా నియంత్రణలతో మాత్రమే ఇస్తామని చెబుతోంది. ఎందుకంటే బంగారం అంత అవసరం కంటే ఎక్కువగా speculative, అంటే ఊహలు ఆధారంగా కొనుగోలు చేసే ప్రాపర్టీగా మారిపోయింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి ప్రమాదం అని RBI భావిస్తోంది.

Related News

రెండు సార్లు

ఇకపై బంగారం మీద అప్పులు ఇచ్చేటప్పుడు కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒకే గోల్డ్ మీద మీరు ఓసారి income purpose (ఉదాహరణకి బిజినెస్ పెట్టడం) కోసమే, మరోసారి consumption purpose (ఉదాహరణకి పెళ్లి, ఆసుపత్రి ఖర్చులు) కోసమే అప్పు తీసుకోవాలి.

ఒకసారి దాన్ని ఏ ప్రయోజనానికి ఉపయోగిస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలి. ఒకదానికంటే ఎక్కువ రకాల ఉద్దేశాల కోసం ఒకే బంగారాన్ని చూపించలేరు.

RBI మరో ముఖ్యమైన నియమాన్ని స్పష్టంగా పేర్కొంది. మీరు తీసుకునే లోన్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు? దాని గురించి డాక్యుమెంట్లతో సాక్ష్యం చూపించాల్సిందే.

మీరు ఖర్చు చేస్తున్న రికార్డులు బ్యాంకులకు చూపించాలి. బ్యాంకులు కూడా ఈ లోన్ల వాడకాన్ని మానిటర్ చేయాలి. అవసరమైతే ప్రూఫ్ డాక్యుమెంట్లు తీసుకోవాలి.

అంతే కాదు, పెద్ద మొత్తాల కన్‌సంప్షన్ లోన్లకి కూడా ఖచ్చితంగా డాక్యుమెంట్ల ఆధారాలు చూపించాలి. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా మాత్రమే లోన్ ఇవ్వాలి. ఒక వ్యక్తికి ఎంత వరకు లోన్ ఇవ్వాలో కూడా బ్యాంకులు తార్కికంగా నిర్ణయించాలి. దానికి సంబంధించి ఒక uniform policy ఉండాలి. అందరికీ ఒకేలా వర్తించాలి. ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ అనే విధంగా వ్యవహరించకూడదు.

అలాగే, ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు ఉంటే, బ్యాంకులు వెంటనే రిపోర్ట్ చేయాలి. బంగారం pledge చేసే సమయంలోనే suspicious transaction reporting విధానం పాటించాలి.

ఈ నియమాలన్నింటితోపాటు అన్ని బ్యాంకులు, NBFCలు ఒకే విధంగా ఆచరణలో పెట్టేలా ఒక సాధారణ విధానం తీసుకురావడమే ఈ డ్రాఫ్ట్ లక్ష్యం. అంతేకాదు, ఇప్పటి వరకూ గోల్డ్ లోన్ విషయంలో కొంత అస్పష్టత ఉండేది. ఇప్పుడు ఆ క్లారిటీ ఇవ్వడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశ్యం.

ఇలాంటి మార్గదర్శకాలు రావడంతో ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం, ఐఐఎఫ్ఎల్ వంటి ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీల షేర్లు ఒక్కరోజులోనే 10% పడ్డాయి. ఇది చూస్తేనే తెలుస్తోంది కొత్త మార్గదర్శకాలు ఎంత ప్రభావాన్ని చూపించబోతున్నాయో. గోల్డ్ మీద అప్పులు ఇచ్చే సంస్థలకే కాకుండా, గోల్డ్ మీద అప్పు తీసుకునే వినియోగదారులపైనా ఇది సీరియస్ ఎఫెక్ట్ చూపించనుంది.

ఇప్పుడు ఈ నిబంధనలు కేవలం డ్రాఫ్ట్ మాత్రమే. అంటే ముసాయిదా. త్వరలో దీనిపై చివరి నిబంధనలు ప్రకటించనున్నారు. ఈలోగా మీరు గోల్డ్ మీద అప్పు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ మార్పులను తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి. లేదంటే రేపు ఏ బ్యాంకూ మీకు లోన్ ఇవ్వదు. ఇచ్చినా సరే, మీరు అంతా సాక్ష్యాలతో నిరూపించాల్సి ఉంటుంది.

చివరిగా చెప్పాల్సిందే – గోల్డ్ లోన్ తీసుకునే రోజులు ఇక మామూలుగా ఉండవు. బంగారం మీదే అన్న ఆధారాలు, దాని వినియోగం ఎలా ఉందనే వివరాలు లేకపోతే లోన్ రావడం చాలా కష్టం. కావున, ఇప్పుడు ఉన్న లోన్ అవకాశాలను ఉపయోగించుకోవాలంటే వేగం చేయాల్సిందే. లేదంటే రేపటినుంచి కఠిన నియమాలు మన జేబులు ఖాళీ చేసేలా ఉంటాయ్.