ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్ చేయొచ్చా?
రెస్టారెంట్ బిల్లులు, ట్రిప్ ఖర్చులు సింపుల్‌గా split చేసుకోవచ్చా? మీరు ఎప్పటికప్పుడు బిల్లు కట్టలేదా? ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ఉంటే బాగుంటుంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం అందుకే ఇప్పుడు ఈ టీచర్స్ తో కొత్త పేమెంట్స్ విధానం వచ్చింది. దీనిలో ఉన్న కొత్త ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
BHIM-UPI 3.0 అంటే ఏమిటి?
భారత్‌లో డిజిటల్ పేమెంట్స్‌ను సులభతరం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016లో BHIM-UPI సేవలను ప్రారంభించారు. ఇప్పటివరకు 3 అప్‌డేట్స్ వచ్చాయి. ఇప్పుడు BHIM 3.0 లేటెస్ట్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.
ఈ కొత్త వెర్షన్‌ను RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ దీప్ ప్రారంభించారు. ఈ అప్‌డేట్‌తో మరింత వేగంగా, సురక్షితంగా, తక్కువ డేటాతో BHIM-యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
BHIM 3.0 కొత్త ఫీచర్లు ఏవి?
- 15కి పైగా భాషల్లో యాప్ అందుబాటులో ఉంది.
- ఇంటర్నెట్ స్లోగా ఉన్నా లావాదేవీలు కొనసాగుతాయి.
- రెస్టారెంట్ బిల్లులు, ట్రిప్ ఖర్చులు స్నేహితుల మధ్య split చేసుకోవచ్చు.
- IPO ఆప్రూవల్, BHIM యాప్‌లోనే మ్యాండేట్ సెట్ చేసుకోవచ్చు.
- డార్క్ మోడ్ – లైట్ మోడ్ ఎంచుకునే ఫీచర్.
- హోమ్ స్క్రీన్‌లోనే అన్ని ముఖ్యమైన ఫీచర్లు.
- మీ పెండింగ్ బిల్లులను గుర్తు చేసే టాస్క్ అసిస్టెంట్.
- సింపుల్ & క్లియర్ UI/UX, మరింత ఈజీగా ఉపయోగించుకోవచ్చు.
వ్యాపారుల కోసం ప్రత్యేకమైన ఫీచర్లు
- BHIM Vega – మర్చంట్స్ ఇప్పుడు యాప్‌లోనే డైరెక్ట్ పేమెంట్ తీసుకోవచ్చు.
- మూడో పార్టీ యాప్స్ వద్దకెళ్లకుండా కస్టమర్లు డైరెక్ట్‌గా BHIM-UPIతో పేమెంట్ చేయొచ్చు.
NPCI ఛైర్మన్ అజయ్ కుమార్ చౌధరి ఏమన్నారు?
- BHIM-UPI డిజిటల్ పేమెంట్స్‌ను సురక్షితంగా, సులభంగా మార్చింది.
- BHIM 3.0 ద్వారా మరింత మంది వినియోగదారులు, వ్యాపారులు డిజిటల్ ఫైనాన్స్‌లో ముందుకు సాగగలరు.
BHIM 3.0 అప్‌డేట్ ఇప్పుడే ట్రై చేయండి. మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి.