దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది. అందులో గూగుల్ పే, ఫోన్ పే వంటి ఆన్ లైన్ పేమెంట్స్ యాప్ లు ఎక్కువ ఆదరణ పొందాయని చెప్పొచ్చు. అయితే తాజాగా ఈ UPI వాడే వారికి RBI శుభవార్త అందించింది.
బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఏ చిన్న వ్యవహారమైనా RBI కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ తమ నిర్ణయాలను వివిధ బ్యాకింగ్ రంగాలకు దిశానిర్దేశం చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. UPI లైట్ లో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. మరో మాటలో చెప్పాలంటే, UPI ద్వారా చిన్న మొత్తాల డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Related News
దీని ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లైట్ లో నగదును ఆటోమేటిక్‌గా లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందించింది. మరియు ఈ వ్యవస్థలో, చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనితో పాటు ఫాస్టాగ్‌కు కూడా ఇదే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. కానీ ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే చిన్న మొత్తాల చెల్లింపులు కూడా పెరుగుతాయని ఆర్బీఐ వెల్లడించింది.
UPI Modified version is UPI lite. కాగా, ఇది వాలెట్‌లా పనిచేస్తుంది. ఎందుకంటే.. దీని ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు పిన్ అవసరం ఉండదు. అయితే, ప్రస్తుతం UPI లైట్ సర్వీస్ వినియోగదారులు తమ వాలెట్‌లో రూ.2000 వరకు లోడ్ చేసుకోవచ్చు, రూ. 500 వరకు లావాదేవీలు చేయడానికి సహాయపడుతుంది. కానీ, ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చబోతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇప్పుడు UPI వినియోగదారులు Lite Wallet కోసం ఆటో-రిప్లెనిష్‌మెంట్ ఫీచర్ నుండి ప్రయోజనం పొందుతారు. అంటే, UPI లైట్‌లో బ్యాలెన్స్ పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు, బ్యాంక్ ఖాతా నుండి నిధులు ఆటోమేటిక్‌గా లోడ్ అవుతాయి. అంతేకాకుండా, ఈ పరిమితిని వినియోగదారు సెట్ చేయాలి.