రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా కీలక ప్రకటన చేసింది.
వివిధ కేటగిరీల్లో 1,036 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ సహా చాలా ఖాళీలు ఉన్నాయని పేర్కొంది.
అయితే, ఈ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ, దరఖాస్తు ప్రక్రియ జనవరి 7, 2025 నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.
Related News
గడువు ఫిబ్రవరి 6, 2025 వరకు ఉండవచ్చు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అధికారిక వెబ్‌సైట్‌లో. ఉద్యోగ అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు రుసుము, రిజర్వేషన్లు, ఎంపిక విధానం మొదలైన ఇతర వివరాలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే స్పష్టం చేయబడతాయి.
ఈ RRB ఉద్యోగ ఖాళీల వివరాలు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ -187,
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ -338,
- సైంటిఫిక్ సూపర్‌వైజర్ (ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్) -03,
- చీఫ్ లా అసిస్టెంట్ -54,
- పబ్లిక్ ప్రాసిక్యూటర్ -20,
- ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం) -18,
- సైంటిఫిక్ అసిస్టెంట్ -02,
- జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ -130,
- సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ -03,
- స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ -59,
- లైబ్రేరియన్ -10,
- మ్యూజిక్ టీచర్ (మహిళలు) -03,
- ప్రైమరీ రైల్వే టీచర్ -188,
- అసిస్టెంట్ టీచర్ (ఫిమేల్ జూనియర్ స్కూల్) -02,
- ల్యాబ్ అసిస్టెంట్ / స్కూల్ – 07,
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3
- (కెమిస్ట్ మరియు మెటలర్జిస్ట్) -12.
పై విధం ఖాళీలు ఉన్నాయని పేర్కొంది.. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైటు చుడండి