Ration Card: తేలిపోయిన లెక్కలు… వేల మందికి ఇకనుంచి నో రేషన్… మీ పేరూ ఉందా?…

రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. గత కొన్ని నెలలుగా ఈ రేషన్ లబ్ధిదారుల విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రీగా అందించే సన్న బియ్యాన్ని చాలా మంది తీసుకోవడం లేదు. దీంతో అధికారులు దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టారు. ఇప్పుడు ఆ విచారణ పూర్తయ్యింది. ఇందులో చాలామంది అనర్హులుగా తేలిపోయారు. అధికారుల తాజా ప్రకటనలతో చాలామంది కలవరపడుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. మండలస్థాయి రెవెన్యూ సిబ్బందితో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు 6 నెలలుగా రేషన్ తీసుకోని వారి పేర్లను గుర్తించారు. మొత్తం 76,842 మంది లబ్ధిదారులు అనర్హులుగా తేలిపోయారు. ఈ వివరాలు సివిల్ సప్లై శాఖ ద్వారా జిల్లా కలెక్టర్లకు పంపబడ్డాయి.

ఇక వీరిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం. రేషన్ కోటాను వారికి ఇకపై నిలిపివేస్తారు. అంటే ఇకపై వారికి సన్న బియ్యం, ఇతర రేషన్ వస్తువులు అందవు. ఈ నిర్ణయంతో అనర్హుల పేర్లను తొలగించి, అర్హులకు సాయం అందేలా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేసింది.

Related Posts

ఈ అనర్హులలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారుగా ఉన్నారు. కొందరు మరణించిన వారి పేర్లు కూడా ఇప్పటికీ జాబితాలో ఉన్నాయి. ఇంకా కొందరు రెండుచోట్ల పేర్లు నమోదు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం పంపిన వివరాల ఆధారంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డేటాను పరిశీలించిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకున్నారు.

ఇంతకీ మీ పేరు ఈ లిస్ట్‌లో ఉందా? అధికారుల లెక్కల ప్రకారం అత్యధికంగా అనర్హులుగా తేలిన వారు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో ఉన్నారు. మీరు ఆ జిల్లాల్లో ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ పేరు రేషన్ జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. లేకపోతే రేషన్ మిస్ అవుతుందన్న మాట.

ఇది కేవలం మొదటి దశ మాత్రమే. మరిన్ని జిల్లాల్లో పరిశీలన కొనసాగుతోంది. అర్హులు మాత్రమే రేషన్ లబ్ధిదారులుగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అందుకే మీ రేషన్ కార్డు స్టేటస్‌ను వెంటనే చెక్ చేయండి. అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించండి. ఆలస్యం చేస్తే.. రేషన్ మిస్ కావడం ఖాయం!