వాహనదారులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త అందించారు. ఆదివారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక ప్రకటన చేశారు.
మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అతి త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. 6జీ టెక్నాలజీ అమలుకు సిద్ధంగా ఉందన్నారు. భారతదేశాన్ని ఆటో మొబైల్, సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా.. భారత్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మోదీ వెల్లడించారు.
‘బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతి రెండింటికీ ప్రాధాన్యం ఉంది. ఏజెన్సీలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం, గిరిజనులకు మేలు చేస్తాం. సామాజిక, డిజిటల్, భౌతిక రంగాల్లో మౌలిక సదుపాయాలు పెంచుతాం. దేశంలో అనేక చోట్ల శాటిలైట్ టౌన్‌లు నిర్మిస్తున్నాం. దేశంలో వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు మరియు బుల్లెట్ రైళ్లు నడుస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు.