భారీగా విలీనమవుతున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు…
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 44,293 పాఠశాలలు ఉండగా, వాటిల్లో సుమారు 33 వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అధికారులు వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం దాదాపు 30 నుంచి 35 శాతం పాఠశాలలు మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మారనున్నాయి. మరో 35 శాతం పాఠశాలలు బేసిక్ ప్రైమరీ పాఠశాలలుగా రూపాంతరం చెందనున్నాయి. వీటిల్లో చదివే 3,4,5 తరగతుల విద్యార్థుల మోడల్ ప్రైమరీలోకి తరలిం చడంతో మిగిలిన 1, 2 తరగతులున్న 30 శాతం పాఠశాలలను పౌండేషనల్ పాఠశాలలుగా పరిగణించ నున్నారు.
అలాగే ప్రస్తుతం ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల లో అధికారులు ప్రతిపాదించిన విద్యార్థుల సంఖ్య కంటే తక్కువ విద్యార్థులున్న 60 శాతం పాఠశాలలు (6,7,8 తరగతులు) డౌన్ గ్రేడ్ గా పరిగణించబడి మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ పాఠ శాలల్లో విలీనం కానున్నాయి. మిగిలిన 40 శాతం పాఠశాలలు హైస్కూల్గా అప్గ్రేడ్ కానున్నాయి.
Related News
ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా 100 శాతం రద్దుకావడంతో ప్రస్తుతం ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను కొత్తగా ఏర్పాటు చేయనున్న మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ, అప్ గ్రేడ్ కానున్న హైస్కూళ్లలో నియమించాల్సి ఉంది. అయితే సిబ్బంది నియామకంలో అధికారులు ప్రతిపాదించిన విద్యార్థుల సంఖ్యకు ఉపా ధ్యాయ సంఘాల నేతలు ఏకీభవించడంలేదు.