Postal Insurance: రోజుకు రూ.1.50 చెల్లించడం ద్వారా..10 లక్షల ప్రయోజనం పొందండి..!

జీవిత భీమా అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో చాల అవసరం. పోస్టల్ డిపార్ట్‌మెంట్ తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమాను అందిస్తోంది. మీరు రోజుకు రూ. 1.5 చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల కవరేజ్ పొందవచ్చు. అయితే 18-65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అర్హులు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఎంత ముఖ్యమో, ఊహించని సంఘటన జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి ఆరోగ్యం మరియు ప్రమాద బీమా కూడా అంతే ముఖ్యమని హెడ్ పోస్ట్ మాస్టర్ తిరుపతి అంటున్నారు. ఊహించని సంఘటన జరిగి ఇంటి యజమాని మరణిస్తే, కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రమాద బీమా ఉపయోగపడుతుంది. అయితే, చాలా మంది ఈ బీమా తీసుకోవడానికి ఇష్టపడరు. అధిక ప్రీమియం వల్ల వారు నిరాశ చెందుతారు. అలాంటి వారందరికీ పోస్టల్ డిపార్ట్‌మెంట్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఇది చాలా తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యాలను అందిస్తోంది. ప్రైవేట్ బీమా కంపెనీలతో భాగస్వామ్యంతో బీమా సౌకర్యాలను అందిస్తోంది.

Related News

పోస్టాఫీస్ అందించే ప్రమాద బీమాలో ఇది అద్భుతమైన పథకం అని చెప్పవచ్చు. మీరు రోజుకు కేవలం రూ. 1.5 చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల కవరేజ్ పొందవచ్చు. టాటా AIG, నివా భూప, స్టార్ హెల్త్ సహకారంతో పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈ బీమాను అందిస్తోంది.

సంవత్సరానికి రూ. 520 చెల్లిస్తే సరిపోతుంది. పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే, నామినీకి రూ. 10 లక్షలు. లేదా శాశ్వత వైకల్యం లేదా పాక్షిక వైకల్యం సంభవించినప్పుడు, రూ. 10 లక్షలు ఇవ్వబడుతుంది. ప్రమాదం మరియు ఆసుపత్రిలో చేరిన తర్వాత, వైద్య ఖర్చుల కోసం రూ. 1 లక్ష ఇవ్వబడుతుంది. పాలసీదారుడు మరణిస్తే, 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇద్దరు పిల్లల చదువు కోసం రూ. 1 లక్ష ఇవ్వబడుతుంది. అదనంగా, పాలసీదారుడు ఒకటి లేదా రెండు రోజుల చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే, ఖర్చులు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ప్రకారం చెల్లించబడతాయి. గరిష్ట మొత్తం రూ. 1 లక్ష వరకు ఉంటుంది.