పోస్ట్ ఆఫీస్ గ్యారంటీ రాబడి ఇచ్చే మంచి స్కీమ్స్ అందిస్తోంది. రిస్క్ లేకుండా 7% – 8.2% వరకు వడ్డీ అందించే ఈ స్కీమ్స్, చిన్న మొత్తాల పెట్టుబడిదారులకు, పెన్షనర్లకు, భద్రత కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్. కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి 8 స్కీమ్స్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.
1. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)
- వడ్డీ రేటు: 7.4%
- పెట్టుబడి: రూ. 100 నుంచి ప్రారంభం, గరిష్ఠం రూ. 9 లక్షలు (జాయింట్ అకౌంట్‌లో)
- కాలపరిమితి: 5 సంవత్సరాలు
- లాభం: ప్రతి నెల వడ్డీ రాబడి, రిస్క్-ఫ్రీ
- పరిమితి: టాక్స్ మినహాయింపు లేదు
2. కిసాన్ వికాస్ పత్ర (KVP)
- వడ్డీ రేటు: 7.5%
- పెట్టుబడి: రూ. 1,000 నుంచి ప్రారంభం, గరిష్ఠ పరిమితి లేదు
- కాలపరిమితి: 115 నెలల్లో డబ్బు రెట్టింపు
- లాభం: పెట్టుబడి డబుల్ అవుతుంది
- పరిమితి: పన్ను మినహాయింపు లేదు
3. సుకన్య సమృద్ధి యోజన (SSY)
- వడ్డీ రేటు: 8.2%
- పెట్టుబడి: ఏడాదికి కనీసం రూ. 250, గరిష్ఠం రూ. 1.5 లక్షలు
- కాలపరిమితి: 21 సంవత్సరాలు (పిల్లకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత 50% విత్‌డ్రా చేయొచ్చు)
- లాభం: టాక్స్ ఫ్రీ వడ్డీ, ఆడపిల్ల భవిష్యత్తుకు ఉత్తమ స్కీమ్
- పరిమితి: పిల్లల పేరు మీద మాత్రమే ఖాతా తెరవాలి
4. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
- వడ్డీ రేటు: 8.2%
- పెట్టుబడి: రూ. 1,000 నుంచి, గరిష్ఠం రూ. 30 లక్షలు
- కాలపరిమితి: 5 సంవత్సరాలు (అదనంగా 3 సంవత్సరాలు పొడిగించవచ్చు)
- లాభం: పెన్షనర్లకు నెమ్మదిగా వచ్చే స్థిరమైన ఆదాయం
- ఊప్పందం: 60 ఏళ్లు దాటినవారే అర్హులు
5. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
- వడ్డీ రేటు: 7.7%
- పెట్టుబడి: రూ. 1,000 నుంచి ప్రారంభం, గరిష్ఠ పరిమితి లేదు
- కాలపరిమితి: 5 సంవత్సరాలు
- లాభం: పెట్టుబడిపై 80C కింద పన్ను మినహాయింపు
- పరిమితి: వడ్డీ మొత్తానికి పన్ను వర్తిస్తుంది
6. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ (Recurring Deposit – RD)
- వడ్డీ రేటు: 6.7%
- పెట్టుబడి: రూ. 100 నుంచి ప్రారంభం, గరిష్ఠ పరిమితి లేదు
- కాలపరిమితి: 5 సంవత్సరాలు
- లాభం: చిన్న మొత్తాలతో పొదుపు ప్రారంభించవచ్చు
- పరిమితి: టాక్స్ మినహాయింపు లేదు
7. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
- వడ్డీ రేటు: 7.1%
- పెట్టుబడి: ఏడాదికి కనీసం రూ. 500, గరిష్ఠం రూ. 1.5 లక్షలు
- కాలపరిమితి: 15 సంవత్సరాలు (5 ఏళ్లకు ఒకసారి పొడిగించుకోవచ్చు)
- లాభం: వడ్డీపై టాక్స్ మినహాయింపు, గ్యారంటీ రాబడి
- పరిమితి: మధ్యలో పూర్తిగా విత్‌డ్రా చేయలేరు
8. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్
- వడ్డీ రేటు: 4%
- పెట్టుబడి: రూ. 500 నుంచి ప్రారంభం
- లాభం: నిత్యం అవసరాలకు ఉపయోగపడే పొదుపు ఖాతా
- పరమతి: తక్కువ వడ్డీ రేటు
ఈ స్కీమ్‌లు ఎవరికీ బాగుంటాయి?
- మధ్య తరగతి పొదుపుదారులు – KVP, NSC, RD
- పెన్షనర్లు – SCSS, POMIS
- ఆడపిల్లల తల్లిదండ్రులు – SSY
- లాంగ్ టర్మ్ పెట్టుబడి దారులు – PPF
భద్రత కలిగిన పొదుపు స్కీమ్ కావాలనుకుంటే, ఇప్పుడే మీకు సరిపోయే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఎంచుకోండి