Population: మరికొద్ది గంటల్లో పాత సంవత్సరం ముగియనుంది.. కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌తో పాటు ప్రపంచ జనాభాకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ జనాభా ఇప్పటికే 800 కోట్ల మార్కును దాటింది. అదే సమయంలో ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా కొనసాగుతుండగా.. కొద్దిరోజుల క్రితం చైనాను వెనక్కు నెట్టి భారత్ టాప్ ప్లేస్ కు చేరుకుంది.
తాజాగా, అమెరికా జనాభా బ్యూరో ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. 2025 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకుంటుందని.. అందులో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అంటున్నారు. 2024 డిసెంబర్ 31 నాటికి ప్రపంచ జనాభా 7.1 కోట్లు పెరిగిందని.. కొత్త ఏడాది నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని అమెరికా జనాభా బ్యూరో నివేదిక వెల్లడించింది. అయితే గత ఏడాది 2023 నాటి జనాభాతో పోలిస్తే 2024లో ప్రపంచ జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గిందని వెల్లడించింది. ప్రపంచ జనాభా పెరుగుదల 0.9 శాతం మాత్రమే నమోదైందని వివరించారు.
రాబోయే 2025 సంవత్సరానికి వచ్చేసరికి, జనవరిలో ప్రపంచ జనాభా మరో 75 మిలియన్లు పెరుగుతుందని US పాపులేషన్ బ్యూరో అంచనా వేసింది. వచ్చే ఏడాది ప్రపంచంలో ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు సంభవిస్తాయని ఈ నివేదిక ప్రాథమిక అంచనాలను రూపొందించింది. ఈ నివేదిక US జనాభా గురించి కూడా వెల్లడించింది. 2024లో US జనాభా 2.6 మిలియన్లు పెరిగిందని చెప్పబడింది. 2025 నాటికి US జనాభా 341 మిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది. కొత్త సంవత్సరం జనవరిలో, US లో ప్రతి 9 సెకన్లకు ఒక జననం జరుగుతుందని అంచనా. . ప్రతి 9.4 సెకన్లకు ఒక మరణం సంభవిస్తుందని అంచనా.
US పాపులేషన్ బ్యూరో ప్రకారం, 2020లలో US జనాభా దాదాపు 9.7 మిలియన్లు పెరిగింది. ఈ వృద్ధి రేటు 2.9 శాతమని చెప్పారు. 2010లలో అగ్రరాజ్యం జనాభా వృద్ధి రేటు 7.4 శాతం. 2024లో భారత జనాభా 144.17 కోట్లుగా తేలింది. 2025 నాటికి భారతదేశ జనాభా అన్ని దేశాలను మించి ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉందని బ్యూరో అంచనా వేసింది.