Police: బంపర్ ఆఫర్.. సమాచారం ఇవ్వండి.. రూ. 2 లక్షలు తీసుకోండి

రోజురోజుకు పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు పోలీసులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. నేరస్తులను పట్టుకునేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ముఖ్యంగా marijuana and drugs  వంటి మాదక ద్రవ్యాల విక్రయాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సమాజానికి హాని కలిగించే మాదక ద్రవ్యాల విక్రయాలను అరికట్టేందుకు తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad citys లో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొందరు యువకులు నార్కోటిక్ ట్యాబ్లెట్లు, ఇంజక్షన్ల వంటి మందు సామాగ్రిని ఇళ్ల నుంచి విక్రయిస్తూ హంగామా చేయకుండా నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది మైనర్ యువకులే. దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో drugs సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు వినూత్న ప్రణాళికతో ముందుకొచ్చారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు స్కెచ్ వేసి.. drugs  సరఫరా చేసే వారు పట్టుబడితే రూ. 2 లక్షలు రివార్డుగా ప్రకటించారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు.

సమాచారం ఇచ్చే వారు 8712671111కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. drugs సరఫరాపై సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.