రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ పథకంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. రైతులకు ఇబ్బందులు కలగకుండా పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వం 2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేసింది.ఈ పథకంలో భాగంగా దేశంలోని అర్హులైన రైతులందరికీ పంటసాయం కింద ఏడాదికి రూ.6వేలు అందజేస్తోంది. దీంతో ఈ పథకంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ పథకం కింద రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు మోదీ ప్రభుత్వం కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. పీఎం కిసాన్ కింద ఇస్తున్న పంట సహాయాన్ని పెంచాలనే ఆలోచనతో ఆ దిశగా కృషి చేయడం ప్రారంభించింది.
Related News
పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా రైతులకు ఇచ్చే వార్షిక మొత్తం రూ. 6 వేల నుంచి 10 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రజల్లో చర్చ సాగుతోంది. ఫిబ్రవరి 1, 2025న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఈ నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తున్న రూ.6 వేలను ప్రస్తుతం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో ఒక్కో విడతలో ఎకరాకు రూ.2 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందజేస్తోంది. ఇప్పటి వరకు 18 వాయిదాల డబ్బులు విడుదలయ్యాయి. ఇప్పుడు 19వ విడత డబ్బుల కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. 19వ భాగం ఫిబ్రవరి 2025 నెలలో విడుదల కానుందని తెలుస్తోంది.