భారత ప్రభుత్వం ఫిబ్రవరి 24, 2025న PM-KISAN యోజన 19వ విడత విడుదల చేయనుంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులు తమ 19వ విడత డేట్ ను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
అక్టోబర్ 5, 2024న భారత ప్రధాని PM-KISAN 18వ విడతను ప్రారంభించారు. DBT (Direct Benefit Transfer) ద్వారా ఈ పథకం కింద నమోదైన రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక సహాయం జమ అవుతుంది.
PM-KISAN 19వ విడత వివరాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రం, భగల్పూర్ లో PM-KISAN 19వ విడతను ప్రారంభించనున్నారు. ఈ విడతలో రైతుల ఖాతాల్లో రూ.2,000 నేరుగా DBT విధానం ద్వారా జమ అవుతుంది. ఇప్పటి వరకు 11 కోట్లు మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కల్పించింది. మొత్తం రూ. 20,000 కోట్ల వరకు రైతులకు అందజేశారు.
Related News
PM-KISAN పథకానికి అర్హతలు
- భారత పౌరుడు కావాలి.
- చిన్న, సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
- రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు అర్హులు కావు.
- డాక్టర్, లాయర్, ఇంజినీర్ లేదా CA గా పని చేస్తున్నవారు ఈ పథకానికి అర్హులు కాదు.
ఆర్థిక ప్రయోజనాలు
1. రూ.6,000 సంవత్సరానికి మూడు విడతలుగా (రూ.2,000 చొప్పున) రైతులకు అందుతుంది.
2.DBT పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది.
కావాల్సిన పత్రాలు
- ఆధార్ కార్డ్
- భూమి పత్రాలు
- సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వివరాలు
- రేషన్ కార్డు / పౌరసత్వ ధృవీకరణ పత్రం
- KYC పత్రాలు
PM-KISAN 19వ విడత స్థితి చెక్ చేసే విధానం (PFMS పోర్టల్)
Step 1: PMFS అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
Step 2: “Check Your DBT Payment Status” బటన్‌పై క్లిక్ చేయండి.
Step 3: ఆధార్ నంబర్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
Step 4: “View Installment” బటన్‌ను క్లిక్ చేస్తే, మీ విడత స్థితి కనబడుతుంది.
సంప్రదించాల్సిన నెంబర్లు
📞 హెల్ప్‌లైన్ నంబర్: 155261 / 011-24300606
(గమనిక: ఈ సమాచారం మారవచ్చు. తాజా వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.)