పండగ వేళ రైతులకు శుభవార్త.. త్వరలో PM కిసాన్ 19వ విడత!

కేంద్ర ప్రభుత్వం త్వరలో 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ యోజనను విడుదల చేయనుంది. ఈ పథకం కింద.. అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ. 6 వేల ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ ఆర్థిక సహాయం మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం జామ చేస్తుంది. కాగా, ప్రతి విడతలో ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 2,000 నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

 

ఇప్పటివరకు, దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాలకు 18 విడతలుగా ఆర్థిక సహాయం అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది అక్టోబర్ 5న మహారాష్ట్రలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Related News

PM కిసాన్ 19వ విడత ఎప్పుడు వస్తుంది?

కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రధానమంత్రి కిసాన్ యోజన వాయిదాలను విడుదల చేస్తుంది. కాగా, చివరి విడత అక్టోబర్ 2024లో వచ్చింది. దీని ప్రకారం.. ఈ పథకం తదుపరి విడత ఫిబ్రవరిలో విడుదల కావచ్చు. అయితే, దీని గురించి ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు.

PM కిసాన్ యోజన ఎవరికి లభించదు?

ప్రధానమంత్రి కిసాన్ యోజనను సద్వినియోగం చేసుకోవడానికి, ఈ-కెవైసి, భూమి రికార్డులను, అంటే భూమి యాజమాన్యాన్ని ధృవీకరించడం అవసరం. ధృవీకరణ చేయని రైతులకు ఈ పథకం ప్రయోజనం లభించదు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి వీలైనంత త్వరగా ఈ-కెవైసి, భూ రికార్డుల ధృవీకరణ చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు నిరంతరం రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి, రైతు బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించడం అవసరం.

PM కిసాన్ వల్ల కలిగే ప్రయోజనాలు

1. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ఏటా రూ.6,000 సహాయం అందుతుంది. ఇది వారి వ్యవసాయ సంబంధిత అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడుతుంది.
2. తక్కువ భూమి ఉండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
3. పీఎం కిసాన్ డబ్బులు మొత్తం నేరుగా లబ్ధిదారుడి ఖాతాకు వస్తుంది. పంపబడుతుంది.
4. ఈ పథకంలో రైతుల నమోదు ప్రక్రియ చాలా సులభం. ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ చేయవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *