Personal Finance: రూ.10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..?

మీకు రూ.7 కోట్లు ఆదా చేయాలనే లక్ష్యం ఉందా? అయితే దీని కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ప్రతి నెల ఎంత పొదుపు చేయాలి, ఎన్ని సంవత్సరాలు పొదుపు చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంవ్యక్తి నెలనెలా వచ్చే జీతంలోంచి బిల్లులు కట్టడంతోపాటు ఇంటి పనులు చూసుకోవాలి కూడా . కానీ ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. ఆ క్ర మంలోనే ఆ వ్య క్తి త న ఆర్థిక భ విష్య త్తును భద్రంగా ఉంచుకోవాలని నిర్ణయించుకునిమంచి ప్లాన్ సిద్ధం చేశాడు.

నెలకు కొంత మొత్తం..

Related News

అందుకు తన స్నేహితుడి ద్వారా SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) గురించి తెలుసుకున్నాడు. అతను దానిని ఇతర పెట్టుబడులతో పోల్చాడు. SIP పద్ధతిలో ఎక్కువ రాబడులు వస్తున్నాయని గమనించి, క్రమంగా అందులో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో కేవలం నెలకు రూ. 10,000. మొదట్లో పెద్దగా లాభాలు చూడలేదు. కానీ క్రమంగా, సంవత్సరాలు గడిచేకొద్దీ, అతని పెట్టుబడులు నెమ్మదిగా పెరిగాయి.

పెట్టుబడి మొత్తం..

తద్వారా రూ. సిప్‌లో రూ.10,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ వ్యక్తి 30 ఏళ్లపాటు ఆదా చేశాడు. దీనితో, పెరుగుతున్న మార్కెట్ ఆధారంగా సగటు వార్షిక రాబడి 15%తో అతని పెట్టుబడులు భారీగా పెరిగాయి. మొత్తం 30 ఏళ్ల తర్వాత అతని ఖాతాలో దాదాపు రూ. 7,00,98,206 కోట్లు చేరాయి. . ఆ క్రమంలో అతడు పెట్టిన మొత్తం పెట్టుబడులు రూ. 36,00,000 లక్షలు, అదనంగా వచ్చిన మొత్తం రూ.6,64,98,206 కోట్లు. ఈ క్రమంలో కేవలం లక్ష రూపాయలు పొదుపు చేస్తే కొన్నేళ్లలో కోటి రూపాయలు సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మీ పిల్లల పెళ్లి కొరకు

కాబట్టి చిన్నప్పటి నుంచి పని చేస్తూ పొదుపు చేయడం ప్రారంభిస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చని చెబుతున్నారు. ఓపికగా పెట్టుబడి పెడితే అద్భుత ఫలితాలు సాధించి ఆర్థిక స్వాతంత్య్రం సాధించవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలంలో మంచి డబ్బు సంపాదించడానికి అనేక పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

మ్యూచువల్ ఫండ్ SIP వాటిలో ఒకటి. దీర్ఘకాలంలో పెద్ద కార్పస్‌ను నిర్మించడంలో మ్యూచువల్ ఫండ్ SIP చాలా సహాయపడుతుంది. మీరు మీ పిల్లల చదువులు లేదా మీ పిల్లల వివాహం వంటి అనేక ఇతర ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించవచ్చు. మ్యూచువల్ ఫండ్ SIP మీ అన్ని అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గమనిక: SIPలో పెట్టుబడి పెట్టమని మేము మీకు సలహా ఇవ్వడం లేదు. మా వద్ద ఉన్న సమాచారాన్ని అందజేస్తున్నాం. SIP పెట్టుబడులు మార్కెట్ లాభాలు మరియు నష్టాలకు లోబడి ఉంటాయి.