ప్రస్తుత విధానం ప్రకారం, ప్రాథమిక వేతనాన్ని పే కమిషన్ నిర్ణయిస్తుంది. జీతం పెరుగుదల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఆధారపడి ఉంటుంది.
అయితే త్వరలో ఈ పరిస్థితి మారుతుందనే ప్రచారం జరుగుతోంది. కొత్త విధానం వల్ల జీతం గణనీయంగా పెరగనుందని తెలుస్తోంది. పెర్ఫార్మెన్స్ బేస్డ్ పే సిస్టమ్ అనే కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. పనితీరు ఆధారిత చెల్లింపుతో, ఉద్యోగుల జీతాలు ద్రవ్యోల్బణం మరియు ఉద్యోగుల పనితీరు ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ విధానం మరింత లాభదాయకంగా ఉందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరిలో సమర్పించే కేంద్ర బడ్జెట్‌లో అధికారికంగా అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
8వ వేతన సంఘం మరియు దాని భర్తీ విధానం గురించి కొన్ని వారాలుగా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇప్పటివరకు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త పే కమిషన్ ఏర్పడుతుంది. ప్రస్తుత 7వ వేతన సంఘం 20214లో ప్రకటించి 2016లో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.. దాని పదవీకాలం 2026తో ముగుస్తుంది.అంటే 2026 నాటికి తదుపరి పే కమిషన్.. అంటే 8వ వేతన సంఘం ఏర్పాటు చేసి దాని సిఫార్సులు అమలు చేయాలి.
Related News
అయితే 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఇప్పట్లో ఎలాంటి చర్చ లేదని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పే కమీషన్ లేకపోవడంతో వేతన సవరణ ఎలా చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రతి పదేళ్లకు ఒకసారి ఏర్పడే పే కమిషన్ స్థానంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందిస్తోందన్న ప్రచారం సాగుతోంది. వేతన సవరణకు కొత్త ఫార్ములాను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
జీతాల పెంపును లెక్కించడానికి ప్రభుత్వం ఇప్పుడు ICROT ఫార్ములాను ఉపయోగించడాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఈ కొత్త పద్ధతి ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛనుదారుల పింఛన్లలో భారీగా పెంపుదల ఉంటుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పెర్ఫార్మెన్స్ బేస్డ్ పే సిస్టం అనే కొత్త విధానంలో ఉద్యోగుల జీతాలు ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయని ఉపాధి వర్గాలు భావిస్తున్నాయి.
కొత్త పాలసీలో ద్రవ్యోల్బణం రేటు, ఉద్యోగుల పనితీరు రెండింటి ఆధారంగా ఉద్యోగుల జీతం, కరువు భత్యం నిరంతరం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల కొనుగోలు శక్తి మెరుగుపడే అవకాశం ఉంది. ప్రయివేటు రంగంలో మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారి పనితీరు ఆధారంగా జీతాలు పెరగనున్నాయన్నది దీని సారాంశం. ఇప్పుడు కూడా స్టాండర్డ్ పే ప్రకారం జీతం పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.
కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జీతాల పెంపుదల పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో 14 పే గ్రేడ్‌లు ఉన్నాయి. ఉద్యోగుల నుంచి అధికారుల వరకు అందరూ అన్ని పే గ్రేడ్‌లలో చేర్చబడ్డారు. దీంతో వారి జీతంలో పెద్దగా మార్పు రావడం లేదు. కొత్త విధానంలో ఉద్యోగులందరికీ సమాన ప్రయోజనాలు కల్పించాలన్నది వాదన.